Alia Bhatt: అలియా కంటే ముందు గంగూబాయి పాత్ర కోసం వీరిని సంప్రదించారట.. ఎందుకు తిరస్కరించారంటే..
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గంగుబాయి కథియావాడి (Gangubai Kathiawadi). హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఈ సినిమాను తెరకెక్కించారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గంగుబాయి కథియావాడి (Gangubai Kathiawadi). హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఈ సినిమాను తెరకెక్కించారు. . సుమారు రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న హిందీతో పాటు తెలుగులో విడుదలైంది. అయితే సౌత్‌లో గంగుబాయి హడావిడి పెద్దగా కనిపించకపోయినప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.57 కోట్ల దాకా వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో మాఫియా క్వీన్ పాత్రలో అదరగొట్టింది అలియా భట్(Alia Bhatt). ఒక కుర్ర హీరోయిన్ అంతటి బరువైన పాత్ర చేయగలదా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుందీ అందాల తార.
అలా అలియా చెంతకు...
కాగా గంగుబాయి పాత్రలో కోసం ముందుగా అలియాను అనుకోలేదట. ఆమె కంటే ముందు ముగ్గురు హీరోయిన్ల దగ్గరికీ ఈ సినిమా స్ర్కిప్టు వెళ్లిందట. ముందుగా గంగుబాయి పాత్రకోసం దీపికా పదుకొణె దగ్గరకు వెళ్లారట భన్సాలీ. అంతకు ముందే దీపికతో ఆయన పద్మావత్ లాంటి సూపర్‌హిట్ సినిమాను తెరకెక్కించారు. అయితే అప్పటికే దీపిక ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో గంగుబాయికి నో చెప్పిదంట. ఆతర్వాత గ్లోబల్ బ్యూటీ ప్రియాంకను సంప్రందించాలనుకున్నారట. అయితే అంతలోనే గంగుబాయి కథకు మిమ్మల్ని అనుకుంటున్నారట అని ఆమెను అడగ్గా ‘ నా దగ్గరకు ఎవరూ ఆ కథతో రాలేదు. ప్రస్తుతం నేను హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాను. కాబట్టి హిందీ సినిమాలను అంగీకరించలేను’ అని తేల్చి చెప్పేసింది. దీంతో ప్రియాంక దగ్గరకు వెళ్లకుండానే డ్రాప్ అయ్యారట దర్శక నిర్మాతలు. ఇక గతంలో సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది రాణీ ముఖర్జీ. దీంతో మరోసారి ఆమెతోనే సినిమా చేద్దామనుకున్నారట. అయితే వ్యక్తిగత కారణాల వల్ల గంగుబాయి ఆఫర్‌ను తిరస్కరించిందట రాణీ. అలా చివరగా ఈ అవకాశం అలియా చెంతకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలతోనే ఎక్కువగా ఆకట్టుకున్న ఈ అందాల తార ‘గంగుబాయి’తో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సైతం తానే పర్‌ఫెక్ట్ ఛాయిస అని నిరూపించుకుంది.
Also Read:భారీ చోరీ !! రూ. 36లక్షలతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ జంప్ !! వీడియో
Viral Video: మహిళపై షార్క్ ఎటాక్ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో
టామ్ అండ్ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో