AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇస్మార్ట్ శంకర్’కు బీరుతో అభిషేకం!

విశాఖ: కొత్త సినిమా విడుదలైతే చాలు.. అభిమానులు అందరూ తమ హీరోల కటౌట్లు, ఫ్లెక్సీలను థియేటర్ల వద్ద ఏర్పాటు చేసి పాలాభిషేకం చేస్తుండడం ఆనవాయితీ. సరిగ్గా ఇలాంటి సందర్భం ఒకటి నిన్న రిలీజైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా థియేటర్ దగ్గర చోటు చేసుకుంది. విశాఖలోని జగదాంబ థియేటర్ ముందు ‘ఇస్మార్ట్ శంకర్’ కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేసి దాన్ని వెరైటీగా అభిషేకించారు. పాలు, పుష్పాలు, జ్యూస్‌లతో అనుకుంటే పొరపాటే… వీటితో కాకుండా ఇంకాస్త వైరటీగా అభిమానులు బీరు […]

'ఇస్మార్ట్ శంకర్'కు బీరుతో అభిషేకం!
Ravi Kiran
|

Updated on: Jul 19, 2019 | 5:35 PM

Share

విశాఖ: కొత్త సినిమా విడుదలైతే చాలు.. అభిమానులు అందరూ తమ హీరోల కటౌట్లు, ఫ్లెక్సీలను థియేటర్ల వద్ద ఏర్పాటు చేసి పాలాభిషేకం చేస్తుండడం ఆనవాయితీ. సరిగ్గా ఇలాంటి సందర్భం ఒకటి నిన్న రిలీజైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా థియేటర్ దగ్గర చోటు చేసుకుంది. విశాఖలోని జగదాంబ థియేటర్ ముందు ‘ఇస్మార్ట్ శంకర్’ కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేసి దాన్ని వెరైటీగా అభిషేకించారు. పాలు, పుష్పాలు, జ్యూస్‌లతో అనుకుంటే పొరపాటే… వీటితో కాకుండా ఇంకాస్త వైరటీగా అభిమానులు బీరు పొంగించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అటు ఈ వీడియో దర్శకుడు పూరి జగన్నాధ్ వరకు చేరింది. ఆయన `మార్ ముంత` అనే క్యాప్షన్తో ఇదీ ఇస్మార్ట్ ఆలోచన అంటే!! అంటూ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే వీడియో‌ను తీక్షణంగా చూస్తే.. చెయ్యి ఎత్తితే తాకే దూరంలో కరెంటు తీగలు కనిపిస్తాయి. ఇది గమనించిన కొంతమంది నెటిజన్లు.. అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు జోష్ ఉండడం తప్పుకాదు.. మరీ ప్రమాదాలు కొనితెచ్చుకునే విధంగా ఉండకూడదని కామెంట్స్ చేశారు.

అటు స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి.. పలు వేదికలపై ప్రమాదాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ‘ఇస్మార్ట్ శంకర్’కు అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు. చాలాకాలం తర్వాత పూరి జగన్నాధ్ నుంచి వచ్చిన చిత్రం.. అదీనూ రామ్.. పక్కా మాస్ క్యారెక్టర్‌లో కనిపించడంతో ఫస్ట్ రోజు అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అయ్యాయి.

Follow Us