Bandla Ganesh : వదలని వివాదాలు.. మరోసారి కోర్టు మెట్లక్కిన బండ్లగణేష్.. కారణం ఏంటంటే

|

Nov 11, 2022 | 5:05 PM

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో ప్రొద్దుటూరు కోర్టుకు నేడు హాజరయ్యారు. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన పలువురు సినీ ఫైనాన్షియర్స్ వద్ద..

Bandla Ganesh : వదలని వివాదాలు.. మరోసారి కోర్టు మెట్లక్కిన బండ్లగణేష్.. కారణం ఏంటంటే
Bandla Ganesh
Follow us on

టాలీవుడ్ నటుడు కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తాజాగా కోర్టుకు హాజరయ్యారు. చెక్‌బౌన్స్‌ కేసులో ఆయన ప్రొద్దుటూరు రెండవ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు తన న్యాయవాదితో కలిసి వచ్చారు. టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో ప్రొద్దుటూరు కోర్టుకు నేడు హాజరయ్యారు. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన పలువురు సినీ ఫైనాన్షియర్స్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో సదరు వ్యాపారస్తులు ప్రొద్దుటూరు సివిల్ సెషన్స్ కోర్టులో చెక్ బౌన్స్ కేసులు వేశారు. తనపై కావాలనే కొంతమంది వ్యక్తులు కేసులు వేశారని బండ్ల గణేష్ కోర్టు వద్ద తెలిపారు. గతంలో కూడా పలు మార్లు చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్ట్ కు హాజరయ్యారు.

తాజాగా కోర్టుకు హాజరైన బండ్ల చేక్ బౌన్సులకు సంభందించి క్లియరెన్స్ కోసం గడువు కోరినట్లు తెలుస్తోంది. ఇక బండ్ల గణేష్ నిర్మాతగానే కాకుండా మొన్నటి వరకు రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. అయితే తాను రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఇక త్వరలోనే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.