ఆ ఆఫర్‌కు నో చెప్పేసిన బాలయ్య.. కారణమిదేనా..!
నందమూరి నటసింహ బాలకృష్ణ ఓ ఆఫర్‌కు నో చెప్పేశారట. కారణాలేవో తెలీదు గానీ ఆ పాత్రను చేయలేని చెప్పేశారట. ఇంతకు ఆ పాత్ర ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ పాత్ర.

నందమూరి నటసింహ బాలకృష్ణ ఓ ఆఫర్‌కు నో చెప్పేశారట. కారణాలేవో తెలీదు గానీ ఆ పాత్రను చేయలేని చెప్పేశారట. ఇంతకు ఆ పాత్ర ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ పాత్ర. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఏఎల్ విజయ్.. తలైవి చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర కోసం యూనిట్ బాలయ్యను సంప్రదించారట. ఎన్టీఆర్, జయలలితల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సినిమాల పరంగానే కాదు.. రాజకీయంగానూ వీరిద్దరు క్లోజ్‌గా ఉండేవారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య స్నేహాన్ని సినిమాలో చూపించాలనుకున్న దర్శకుడు.. ఆ పాత్ర కోసం బాలయ్యను సంప్రదించారట.
కానీ పెద్దగా కారణాలేవీ చెప్పకపోయినా ఆ ఆఫర్‌కు ఆయన నో చెప్పారట. అయితే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడులో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటించారు. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో మళ్లీ అదే పాత్ర చేయడం ఇష్టం లేకనే ఆయన ఈ ఆఫర్ కు నో చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ పాత్రను వేరే వారితో చేయించారా..? లేక మహానటిలోలా టెక్నాలజీ సాయంతో ఎన్టీఆర్ ను తెరపైన చూపిస్తారా..? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈ మూవీలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్, శోభన్ బాబు జిస్సు సేన్‌గుప్తా, శశికళగా పూర్ణ కనిపించనున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్; రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Read This Story Also: మందు లేక మందుబాబుల కొత్త ప్రయోగం.. ముగ్గురు మృతి..!