Vijayendra Prasad: ‘వాస్తవాలు తెలిశాక నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయేంద్ర ప్రసాద్‌..

Vijayendra Prasad: దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన రాజమౌళి అండాదండ అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ అనే విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాల కథల వెనకాల ఉంది..

Vijayendra Prasad: 'వాస్తవాలు తెలిశాక నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను'.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయేంద్ర ప్రసాద్‌..
Vijayendra Prasad
Follow us

|

Updated on: Aug 17, 2022 | 9:00 AM

Vijayendra Prasad: దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన రాజమౌళి అండాదండ అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ అనే విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాల కథల వెనకాల ఉంది విజయేంద్రప్రసాద్‌. కేవలం రాజమౌళికి మాత్రమే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్‌ కథను అందించారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ అగ్ర రచయితకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించిన విషయం తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌పై కథ రాయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన పంచుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్‌ మాధవ్‌ రచించిన ‘ది హిందూత్వ పారడైమ్‌’ పుస్తక పరిచయం కార్యక్రం విజయవాడలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌పై త్వరలోనే సినిమాతోపాటు వెబ్‌ సిరీస్‌ను కూడా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ‘కొన్నేళ్ల క్రితం వరకూ ఆర్‌ఎస్‌ఎస్‌పై నాకు వేరే భావన ఉండేది. కానీ సినిమాకు కథ అందించాలని కోరిన సమయంలో.. నాగ్‌పూర్‌ వెళ్లాను. అక్కడ తెలుసుకున్న వాస్తవాలు నా ఆలోచనను మార్చేశాయి. అప్పటి వరకు ఉన్న నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..