చెన్నైలో ఆర్య‌-సాయేషా రిసెప్ష‌న్‌.. హాజ‌రైన కోలివుడ్ ప్ర‌ముఖులు

చెన్నై : నవ దంపతులు ఆర్య-సాయేషాల రిసిప్షన్ గురువారం చెన్నైలో ఘనంగా జరుపుకున్నారు. మార్చి 10వ తేదీన హైద‌రాబాద్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి పెళ్ళికి అల్లు అర్జున్, సూర్య‌, కార్తీ, విశాల్ త‌దిత‌ర ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇక నిన్న సాయంత్రం చెన్నైలో జరిగిన గ్రాండ్ రిసెప్ష‌న్ వేడుక‌కి కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఆర్య సూట్ ధ‌రించ‌గా, సాయేషా రెడ్ క‌లర్ చీర‌లో మెరిసింది. వీరి రిసెప్ష‌న్ వేడుక‌కి సంబంధించిన ఫోటోలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:40 am, Fri, 15 March 19
చెన్నైలో ఆర్య‌-సాయేషా రిసెప్ష‌న్‌.. హాజ‌రైన కోలివుడ్ ప్ర‌ముఖులు

చెన్నై : నవ దంపతులు ఆర్య-సాయేషాల రిసిప్షన్ గురువారం చెన్నైలో ఘనంగా జరుపుకున్నారు. మార్చి 10వ తేదీన హైద‌రాబాద్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి పెళ్ళికి అల్లు అర్జున్, సూర్య‌, కార్తీ, విశాల్ త‌దిత‌ర ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇక నిన్న సాయంత్రం చెన్నైలో జరిగిన గ్రాండ్ రిసెప్ష‌న్ వేడుక‌కి కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఆర్య సూట్ ధ‌రించ‌గా, సాయేషా రెడ్ క‌లర్ చీర‌లో మెరిసింది. వీరి రిసెప్ష‌న్ వేడుక‌కి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. కాగా వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ద‌గ్గ‌ర‌య్యాడు హీరో ఆర్య‌. ఇక అఖిల్ అనే చిత్రంతో టాలీవుడ్ అభిమానుల‌ని ప‌ల‌క‌రించిన‌ స‌యేషా సైగ‌ల్‌ హిందీ, త‌మిళంలో ప‌లు చిత్రాలు చేసింది. 2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ అనే చిత్రంలో ఆర్య‌, సాయేషా క‌లిసి న‌టించారు. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ప్పం చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. స‌యేషా ప్ర‌ముఖ న‌టులు సుమీత్ సైగల్ మరియు షాహీన్‌ల కూతురు కాగా, దిలీప్ కుమార్, సైరా భానుల మ‌న‌వ‌రాలు అనే సంగ‌తి తెలిసిందే. అయితే కొద్ది రోజుల త‌ర్వాత ఆర్య‌- సాయేషాలు తిరిగి షూటింగ్‌ల‌లో పాల్గొన‌నున్నారు.