బన్నీ- త్రివిక్రమ్ మూవీకి ఇంటరెస్టింగ్ టైటిల్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎక్కువగా తండ్రి పాత్రకే ప్రాముఖ్యత ఇస్తాడు. మొదటి సినిమా ‘నువ్వే.. నువ్వే’ దగ్గర నుంచి గత చిత్రం ‘అరవింద సమేత’ వరకు అన్ని కూడా ‘నాన్న’ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాలో కూడా ‘నాన్న’ సెంటిమెంట్ ఉంటుందని […]

బన్నీ- త్రివిక్రమ్ మూవీకి ఇంటరెస్టింగ్ టైటిల్..?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:12 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎక్కువగా తండ్రి పాత్రకే ప్రాముఖ్యత ఇస్తాడు. మొదటి సినిమా ‘నువ్వే.. నువ్వే’ దగ్గర నుంచి గత చిత్రం ‘అరవింద సమేత’ వరకు అన్ని కూడా ‘నాన్న’ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాలో కూడా ‘నాన్న’ సెంటిమెంట్ ఉంటుందని వినికిడి. ఈ సినిమా సెట్స్ మీదకు త్వరలోనే వెళ్లనుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ చిత్రం కోసం ‘నాన్న.. నేను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట యూనిట్. ఇంకా దీని గురించి ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.