రొమాంటిక్ లో బాలీవుడ్ నటి..!

డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రానికి అనిల్ పడూరి దర్శకుడు. ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పూరీనే స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి మందిర బేడిని ఎంపిక […]

  • Ravi Kiran
  • Publish Date - 10:29 am, Fri, 15 March 19
రొమాంటిక్ లో బాలీవుడ్ నటి..!

డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రానికి అనిల్ పడూరి దర్శకుడు. ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పూరీనే స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి మందిర బేడిని ఎంపిక చేశారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రాన్ని పూరి, ఛార్మిలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.