‘మన్మధుడు 2’లో అనుష్క..?

2002లో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మధుడు’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. దాదాపు 17సంవత్సరాల తరువాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నారు. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఖరారు అవ్వగా.. మరో కీలక పాత్రలో […]

‘మన్మధుడు 2’లో అనుష్క..?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:08 PM

2002లో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మధుడు’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. దాదాపు 17సంవత్సరాల తరువాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నారు. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

కాగా ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఖరారు అవ్వగా.. మరో కీలక పాత్రలో అనుష్క నటించోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో షూట్ కూడా ఇటీవల జరిగినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. కాగా నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ చిత్రంతో అనుష్క టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత పలు చిత్రాల్లో ఆయన సరసన నటించిన అనుష్క.. నాగార్జున మీద అభిమానంతో కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలు కూడా చేసిన విషయం తెలిసిందే.