పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి గ్రేట్ కాంబినేషన్‌లో సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. వరుస

  • uppula Raju
  • Publish Date - 11:15 am, Sun, 24 January 21
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి గ్రేట్ కాంబినేషన్‌లో సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. తాజాగా దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వలో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో బద్రీ, ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ వంటి పలు విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి గ్రేట్ కాంబినేషన్‌లో సినిమా అంటే ఇక పవన్ అభిమానులకు పండగ చేసుకోనున్నారు.

Pawan Kalyan Puri Jagannadh combination

సినీ వర్గాల సమాచారం ప్రకారం పూరి పవన్ కోసం ఒక కథను రెడీ చేశాడని, ఇప్పటికే లైన్ కూడా చెప్పాడని, ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని పవన్ పూరికి చెప్పినట్లు తెలుస్తోంది. టైటిల్ ‘జనగనమణ’ అంటున్నారు. భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ జనగనమణ కథను పూరి రాస్తున్నాడట. అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం చుట్టూ సాగుతుందని తెలుస్తోంది. 2022లో వీరి కలయికలో సినిమా ఉంటుందని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ వకీల్‌ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ మల్టీస్టారర్.. పవన్-రానా కాంబినేషన్‏లో సినిమా.. ఇంతకీ టైటిల్ అదేనా?