Nagababu About Niharika :పెళ్లి తర్వాత కూతురు మారిపోయిందంటున్న నాగబాబు.. తనకు కాబోయే కోడలు ఎలావుండాలో చెప్పారుగా

ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలంటే ముద్దే..  ముఖ్యంగా తండ్రికి కూతురంటే మరీ ఇష్టం.. నాన్నకూచి అని చెప్పవచ్చు.. తండ్రి కూతుర్ల అనుబంధం.. వీరిద్దరి మధ్య ఉండే రిలేషన్ అన్ని బంధాలకంటే వెరీవెరీ...

Nagababu About Niharika :పెళ్లి తర్వాత కూతురు మారిపోయిందంటున్న నాగబాబు.. తనకు కాబోయే కోడలు ఎలావుండాలో చెప్పారుగా
Follow us

|

Updated on: Jan 24, 2021 | 11:44 AM

Nagababu About Niharika : ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలంటే ముద్దే..  ముఖ్యంగా తండ్రికి కూతురంటే మరీ ఇష్టం.. నాన్నకూచి అని చెప్పవచ్చు.. తండ్రి కూతుర్ల అనుబంధం.. వీరిద్దరి మధ్య ఉండే రిలేషన్ అన్ని బంధాలకంటే వెరీవెరీ స్పెషల్. ఇక మెగా బ్రదర్ నాగబాబు, ముద్దుల కూతురు నిహారికల మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తన ముద్దుల కూతురు నిహారికకు ఘనంగా పెళ్లి చేసిన ఆనందంలో ఉన్నారు. ఇప్పటికీ నిహారిక చైతుల పెళ్లి వేడుకల సందడి ఫొటోస్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం నాగబాబు షూటింగ్స్ తో మళ్ళీ బిజీఅయ్యారు. ఈనేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి వారి పెళ్లి జీవితం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తనకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమని.. ఈ సృష్టికి మహిళలే మూలం. అందుకే ఆడవాళ్లపై తనకు ఎనలేని గౌరవమని చెప్పారు. వరుణ్ పుట్టిన తర్వాత నెక్స్ట్ కూతురు పుట్టాలని కోరుకున్నానని చెప్పారు. తన కోరిక తీరుస్తూ.. నిహారిక జన్మించింది. తనంటే నాకు చాలా ఇష్టం..నాకో బెస్ట్‌ ఫ్రెండ్. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను కూతురితోనే పంచుకుంటానని చెప్పారు. మా తండ్రీకూతుర్ల మధ్య మాటల్లో చెప్పలేనంత అనుబంధం ఉంది. కాకపోతే, పెళ్లి అయ్యాక మా ఇద్దరి మధ్య మాటలు కొంచెం తగ్గాయని నాగబాబు చెప్పారు. అయినా తన జీవితంలో కొత్త అంకానికి నాంది పలికినందుకు సంతోషంగా ఉందన్నారు మెగాబ్రదర్.

తన కూతురు ఎక్కడ ఉన్నా సందడే..బాగా అల్లరి చేస్తుంది. ఐటీ వరుణ్ తేజ్ అందుకు డిఫరెంట్. తనకు బాగా నచ్చిన బెస్ట్ ఫ్రెండ్స్ తో మాత్రమే అన్ని షేర్ చేసుకుంటాడు.. చాలా సైలెంట్ పర్సన్.. తనకి కూడా పెళ్లి చెయ్యాలి.. అయితే పిల్లల ఇష్టానికే పెళ్లి.. వారి జీవితంలో మంచి భాగస్వామ్యులు వస్తే లైఫ్ చాలా బాగుంటుందని అన్నారు. ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది తమకు ముఖ్యం కాదని.. తాము ముఖ్యంగా కోరుకునేది మాత్రం పిల్లలకు మంచి జీవిత భాగస్వాములు రావాలని చెప్పారు నాగబాబు.

Also Read: కరోనా నేపథ్యంలో భారీగా పెరిగిన వెండి ధర.. మెల్లగా దిగివస్తున్నది