AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith donates: ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న సినీ ప్రముఖులు.. మరో రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన స్టార్‌ హీరో అజిత్‌

Ajith donates: కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా అతలాకుతలం అవుతోంది. ఎన్నో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా.

Ajith donates: ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న సినీ ప్రముఖులు.. మరో రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన స్టార్‌ హీరో అజిత్‌
Subhash Goud
|

Updated on: May 16, 2021 | 6:10 AM

Share

Ajith donates: కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా అతలాకుతలం అవుతోంది. ఎన్నో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలోనే ఉంది. అలుపెరగని పోరాటం చేస్తున్న తమిళనాడు ప్రభుత్వానికి తమవంతు సాయం చేసేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఎంతో మంది తమకు తోచిన విధంగా విరాళాలు ఇస్తూ అండగా నిలుస్తున్నాయి. తాజాగా స్టార్‌ హీరో అజిత్‌ కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటికే 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన అజిత్‌.. తాజాగా దక్షిణ భారత సినీ కార్మికుల ఫెడరేషన్‌కు మరో 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. తమిళనాడు చీఫ్‌ మినిస్టర్‌ ఫండ్‌కు అజిత్‌ అందజేశారు. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా అజిత్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపినట్లు ఆయన ప్రతినిధి తెలిపారు.

అలాగే మరో దర్శకుడు ఏఆర్‌ మురగదాస్‌ కూడా 25 లక్షల చెక్కును ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేశారు. అలాగే హీరో సూర్య, కార్తీ కుటుంబం తరపున కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. కుటుంబ సమేతంగాసూర్య స్టాలిన్‌కు ఈ చెక్కును అందించారు. ఇక సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యామిలీ కూడా కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. తమిళనాడులో స్టాలిన్‌ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతోంది.

కాగా, అజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సేవాగుణంలోను అజిత్ చాలా సార్లు తన గొప్ప మనసు చాటుకున్నారు. గతంలో కూడా ఎంతో మందికి సాయం అందించారు.

ఇవీ చదవండి:

kiara advani: తారక్ సినిమాలో మహేష్ హీరోయిన్.. మరోసారి ఈ ముద్దుగుమ్మకు అవకాశం ఇచ్చిన కొరటాల..

Pragya Jaiswal: మ‌రోసారి బాల‌య్య‌పై ప్రగ్యా క్రేజీ కామెంట్స్.. ఆయ‌న రేంజ్ వేరంటూ