నెట్టింట్లో వైరల్ అవుతున్న ‘ఆమె’ వీడియో..!

తమిళ నటి అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆడై’. ఈ సినిమా తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్ అయింది. ఇక విడుదలకు ముందే ఈ మూవీ సోషల్ మీడియాలో పెద్ద సంచలనం అయిందని చెప్పాలి. టీజర్‌లో అమలాపాల్ న్యూడ్‌గా కనిపించి.. అందరిని షాక్‌కు గురి చేసింది. ఇక ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. వివాదాలు, ఇబ్బందుల నడుమ గత శనివారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల కాకముందు […]

నెట్టింట్లో వైరల్ అవుతున్న 'ఆమె' వీడియో..!
Ravi Kiran

|

Jul 22, 2019 | 8:17 PM

తమిళ నటి అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆడై’. ఈ సినిమా తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్ అయింది. ఇక విడుదలకు ముందే ఈ మూవీ సోషల్ మీడియాలో పెద్ద సంచలనం అయిందని చెప్పాలి. టీజర్‌లో అమలాపాల్ న్యూడ్‌గా కనిపించి.. అందరిని షాక్‌కు గురి చేసింది. ఇక ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. వివాదాలు, ఇబ్బందుల నడుమ గత శనివారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదల కాకముందు సినిమాను ఆపేయాలని ప్రయత్నించిన కొంతమంది.. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ప్రశంసిస్తున్నారు. మూవీలో నగ్నత్వం ఉన్నా.. ఎక్కడా వల్గారిటీ రాకుండా యువతకు సోషల్ మెసేజ్ ఇస్తూ చిత్రాన్ని అద్భుతంగ తెరకెక్కించాడు దర్శకుడు రత్నకుమార్.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుంచి ఓ న్యూడ్ సీన్‌ను హీరోయిన్ అమలాపాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘పేప‌ర్ మీద ఇది న్యూడిటీ ఉండొచ్చు కానీ న‌టిస్తున్న‌పుడు మాత్రం చాలా ఆస‌క్తి అనిపించింది అంటూ ఆమె పేర్కొంది. మొత్తానికి ఈ న్యూడ్ సీన్‌తో సినిమాకు మరింత ప్రమోషన్ దక్కిందని చెప్పవచ్చు. ‘ఆడై’ వసూళ్లు పరంగా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu