AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్టపడుతోన్న బన్నీ

త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడోసారి నటిస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ‘నా పేరు సూర్య’లో ఫిట్‌గా కనిపించిన బన్నీ ఆ మూవీ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ సమయంలో బాడీని పెంచేసిన బన్నీ ప్రస్తుతం […]

కష్టపడుతోన్న బన్నీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2019 | 12:22 PM

Share

త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడోసారి నటిస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

‘నా పేరు సూర్య’లో ఫిట్‌గా కనిపించిన బన్నీ ఆ మూవీ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ సమయంలో బాడీని పెంచేసిన బన్నీ ప్రస్తుతం దానిని తగ్గించే పనిలో పడ్డాడట. కథానుగుణంగా ఈ మూవీలో బన్నీ సన్నగా కనిపించాలట. అందుకోసం స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతున్నాడట స్టైలిష్ స్టార్. కాగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ‘నాన్న నేను’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో బన్నీ సరసన పూజా హెగ్డే రెండో సారి నటిస్తుండగా.. థమన్ సంగీతం అందించనున్నాడు.