అర్హ బర్త్‌డే వేడుకలు చేసిన పుష్ప నిర్మాతలు.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన బన్నీ

అల్లు అర్జున్, స్నేహ తనయ అల్లు అర్హ శనివారం నాలుగో పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందలు అందించారు.

  • Publish Date - 3:15 pm, Sun, 22 November 20 Edited By:
అర్హ బర్త్‌డే వేడుకలు చేసిన పుష్ప నిర్మాతలు.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన బన్నీ

Allu Arha Birthday: అల్లు అర్జున్, స్నేహ తనయ అల్లు అర్హ శనివారం నాలుగో పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందలు అందించారు. అలాగే అంజలి సినిమాలోని అంజలి అంజలి పాటను రీక్రియేట్‌ చేసి ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇదిలా ఉంటే అర్హ పుట్టినరోజు వేడుకలను మైత్రీ మూవీ మేకర్స్‌ గ్రాండ్‌గా చేశారు. ఆ ఫొటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. (వద్దన్న సుజీత్‌.. చేస్తానన్న వినాయక్‌.. మాస్ డైరక్టర్ ఖాతాలో మరో రీమేక్‌..!

అర్హ పుట్టినరోజు నాడు గుర్తుండిపోయే పార్టీని ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌ రవి గారు, నవీన్ గారు, చెర్రీ గారికి వ్యక్తిగతంగా అభినందనలు చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్యు అని ట్వీట్‌ చేశారు. ఇక ఈ ఫొటొల్లో అల్లు అర్జున్, స్నేహ, అల్లు అయాన్‌లతో పాటు దర్శకుడు సుకుమార్ ఉన్నారు. కాగా ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ మూవీపై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. (బాలీవుడ్‌ని వెంటాడుతున్న వరుస మరణాలు.. నటి లీనా మృతి