ఏం చేయాలో అర్థం కాక డ్రగ్స్‌కి అలవాటు పడ్డట్లున్నారు.. సినిమా పరిశ్రమ ఎటు పోతోందో తెలీడం లేదు

బాలీవుడ్‌ని డ్రగ్స్‌ కేసు వెంటాడుతోంది. సుశాంత్‌ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడగా.. ఎన్సీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం ప్రముఖ కమెడియన్‌ భార్తీ సింగ్‌ దంపతులను

ఏం చేయాలో అర్థం కాక డ్రగ్స్‌కి అలవాటు పడ్డట్లున్నారు.. సినిమా పరిశ్రమ ఎటు పోతోందో తెలీడం లేదు
Follow us

| Edited By:

Updated on: Nov 22, 2020 | 4:11 PM

Bharti Singh’s arrest: బాలీవుడ్‌ని డ్రగ్స్‌ కేసు వెంటాడుతోంది. సుశాంత్‌ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడగా.. ఎన్సీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం ప్రముఖ కమెడియన్‌ భార్తీ సింగ్‌ దంపతులను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక వీరి అరెస్ట్‌పై కమెడియన్లు రాజు శ్రీవాస్తవ, సునీల్‌ పాల్‌ స్పందించారు. భార్తీ దంపతులను అరెస్ట్ చేయడం తమని షాక్‌కి గురి చేసిందని వారు అన్నారు.

భార్తీ గురించి సునీల్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో ఆమె పేరును చూసి షాక్‌కి గురయ్యా. నేను ఆమెతో కలిసి పనిచేశా. భార్తీ చాలా కష్టపడి ఈ స్టేజ్‌కి వచ్చింది. ఆమెను గ్రేట్‌ ఇండియన్‌ లాటర్‌ ఛాలెంజ్‌కి పరిచయం చేసింది నేనే. తన పనిలో తాను బాగా గుర్తింపు సాధించింది. ఆమె చాలా సంస్కారవంతంగా ఉండేది. ఆమె భర్త హర్ష్‌ కూడా చాలా మంచివాడు. కానీ వారిద్దరు డ్రగ్స్‌కి ఎలా అలవాటు పడ్డారో తెలీడం లేదు. జానీ లెవర్‌, లతా మంగేష్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి ప్రముఖులు ఎలాంటి డ్రగ్స్ తీసుకోకుండానే సక్సెస్‌ అయ్యారు అని చెప్పుకొచ్చారు.

ఇక రాజు శ్రీవాస్తవ మాట్లాడుతూ.. వారిద్దరు డ్రగ్స్ తీసుకుంటారన్న విషయాన్ని నా మనసు అంగీకరించడం లేదు. ఎంతోమంది వారిని ఇన్ఫిరేషన్‌గా తీసుకుంటుంటారు. భార్తీ చాలా మంది ఆర్టిస్ట్‌. ఆమెను చూసి మేము చాలా గర్వపడేవాళ్లం. ఒక మహిళా కమెడియన్‌గా ఆమె ఉన్నత స్థితికి చేరుకున్నారు. కానీ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వారిద్దరు అంగీకరించిన తరువాత షాక్‌కి గురయ్యా. అసలు ఏం జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీ ఎక్కడకు పోతోంది..? అని వాపోయారు అని చెప్పుకొచ్చారు.

ఈ నటులందరూ ఖాళీగా ఉండి ఏం చేయలో తెలీక డ్రగ్స్‌కి అలవాటు పడ్డట్లు ఉన్నట్లున్నారు. కానీ చేయడానికి ఎన్నో ఉంటాయి. మీరు ఆర్టిస్ట్‌లు. పెద్ద స్క్రీన్‌ మీద కనిపించే వారు. యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేయండి. మంచి సినిమాలు చూడండి అని రాజు చెప్పుకొచ్చారు.

Latest Articles