సౌత్‌లో నంబర్ వన్‌.. ఆగనంటోన్న ‘రాములా’..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న చిత్రం అల వైకుంఠపురంలో. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ వైపు షూటింగ్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తొలి పాటగా వచ్చిన సామజవరగమన‌ యూట్యూబ్‌లో ఇంకా దూసుకుపోతుండగా.. తాజాగా రాములో రాములా అనే రెండో పాట రిలీజ్ అయ్యింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ పాట కూడా […]

సౌత్‌లో నంబర్ వన్‌.. ఆగనంటోన్న 'రాములా'..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 6:35 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న చిత్రం అల వైకుంఠపురంలో. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ వైపు షూటింగ్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తొలి పాటగా వచ్చిన సామజవరగమన‌ యూట్యూబ్‌లో ఇంకా దూసుకుపోతుండగా.. తాజాగా రాములో రాములా అనే రెండో పాట రిలీజ్ అయ్యింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ పాట కూడా యూట్యూబ్‌లో రికార్డులను బ్రేక్ చేస్తోంది.

24 గంటల్లో 8.3 మిలియన్ల (83 లక్షల) వ్యూస్‌ సాధించి రికార్డ్ సృష్టించింది. అంతేకాదు సౌత్‌లో ఈ రికార్డు సృష్టించిన మొదట పాట ఇదే కావడం విశేషం. అలాగే లైక్‌ల విషయంలోనూ రాములో రాములా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ పాటకు 3లక్షల 40 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. తమన్ మాస్ బీట్‌.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వాయిస్‌లు ఈ పాటకు మెయిన్ అస్సెట్‌గా నిలిచాయి. దీంతో యూత్‌ను రాములో రాముల విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్, సునీల్, మురళీ శర్మ, సచిన్ కేడ్కర్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.