Pushpa Movie Update: ‘పుష్ప’ మూడవ షెడ్యూల్ స్టార్ట్… షూటింగ్ కోసం కేరళకు పయనమైన అల్లు అర్జున్..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న సినిమాలో
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న సినిమాలో బన్నీ లారీ డ్రైవర్గా కనిపించబోతున్నాడు. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల మూవీ షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడు పల్లి అటవీ ప్రాంతంలో రెండవ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇక మూడవ షెడ్యూల్ కోసం కాస్తా బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్… తిరిగి కేరళకు పయనమయ్యాడు. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో బన్నీ తన బ్లాక్ రేంజోవర్ కారులో వెళ్తున్నట్లుగా కనిపించాడు. కొన్ని వారాల పాటు కేరళలో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. అక్కడ ఉన్న అడవులలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే విడులైన పోస్టర్లతో మూవీ మీద భారీ అంచనాలను పెంచాయి. ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం సెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
View this post on Instagram
Also Read:
గోపీచంద్ కోసం రంగంలోకి ఇద్దరు హీరోయిన్లు.. ఆ సినిమా కోసం ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..