బాలయ్య సినిమాలో అల్లరి నరేష్..!

సింహా, లెజండ్ చిత్రాల తరువాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో మూడో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే

బాలయ్య సినిమాలో అల్లరి నరేష్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 14, 2020 | 3:53 PM

Balayya- Boyapati film: సింహా, లెజండ్ చిత్రాల తరువాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో మూడో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కి ముందే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఆ మధ్య బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ అభిమానులను చాలా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ద్వారా ఓ కొత్త హీరోయిన్‌ని పరిచయం చేయబోతున్నట్లు ఇప్పటికే బోయపాటి వెల్లడించారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఒక కీలక పాత్ర కోసం అల్లరి నరేష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఇందులో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రకు గానూ అంతకుముందు నవీన్ చంద్ర పేరు వినిపించింది. ఇక ఇప్పుడు అల్లరి నరేష్‌ని అడిగినట్లు సమాచారం. అంతేకాదు ఆ పాత్ర అల్లరోడికి నచ్చిందని టాక్. అయితే ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని తెలుస్తోంది. కాగా ఓవైపు కామెడీ సినిమాల్లో దూసుకుపోతూనే మరోవైపు ఇతర హీరోలతో కలిసి నటిస్తుంటారు అల్లరి నరేష్. ఈ క్రమంలో మహేష్‌ మహర్షి సినిమాలో అల్లరోడికి మంచి పేరు కూడా వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే బోయపాటి, అల్లరి నరేష్‌ని సంప్రదించినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత..? బాలయ్య మూవీలో అల్లరోడు కనిపించబోతున్నాడా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి మిర్యాలగూడ రవీంద్రారెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందించనున్నారు.

Read More:

ఫిక్సింగ్ ఆరోపణలు.. ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం

శ్రావణి కేసు: పరారీలో ఆర్‌ఎక్స్ 100 నిర్మాత