100 కోట్ల దిశగా పరుగులు తీస్తోన్న’కేసరి’

100 కోట్ల దిశగా పరుగులు తీస్తోన్న'కేసరి'

అక్షయ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన కేసరి సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ‘కేసరి’ .. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా 21 కోట్లను కొల్లగొట్టేసి .. ఈ ఏడాది అత్యధిక తొలిరోజు వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లో 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 4వ రోజుతో కలుపుకుని 75 కోట్లను వసూలు చేసింది. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 25, 2019 | 2:42 PM

అక్షయ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన కేసరి సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ‘కేసరి’ .. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా 21 కోట్లను కొల్లగొట్టేసి .. ఈ ఏడాది అత్యధిక తొలిరోజు వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లో 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 4వ రోజుతో కలుపుకుని 75 కోట్లను వసూలు చేసింది. తొలి వారాంతంలోనే 75 కోట్లను రాబట్టిన ఈ సినిమా,100 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగిన సినిమాలు లేకపోవడం వలన, ఈ సినిమా వసూళ్ల జోరు కొన్ని రోజుల పాటు సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన నాయికగా .. పరిణీతి చోప్రా నటించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu