Bachchan Pandey Movie: అక్షయ్ బచ్చన్ పాండే సినిమాపై కేసు.. అసలు కారణం ఎంటంటే ?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న సినిమా 'బచ్చన్ పాండే'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జైసల్మీర్‌లో జరుగుతుంది. అయితే ఇటీవల ఈ సినిమాపై అక్కడి స్థానిక వ్యక్తి ఫిర్యాదు
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘బచ్చన్ పాండే’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జైసల్మీర్‌లో జరుగుతుంది. అయితే ఇటీవల ఈ సినిమాపై అక్కడి స్థానిక వ్యక్తి ఫిర్యాదు చేశాడంట. సినిమా షూటింగ్ మొత్తం కరోనా నిబంధనలను ఉల్లఘింస్తున్నారని, సినిమా షూటింగ్ నిమిత్తం కేవలం 100మందికి మాత్రమే పర్మిషన్ ఉన్నా ఇక్కడ మాత్రం దాదాపు 200 మంది ఒకే చోట ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమా చిత్రీకరణ కారణంగా జైసల్మీర్‌లోని ప్రాంతాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంగా భావిస్తున్నారని, దీంతో జైసల్మీర్ టూరిజం దెబ్బతింటుందని అందులో పేర్కోన్నారు. ఇందులో భాగంగా అక్షయ్ కుమార్, కృతి సనన్, జాక్వలిన్ ఫెర్నాండజ్, అర్షద్ వర్శి, నిర్మాత సాజిద్ నడియా వాలాపై ఫిర్యాదు నమోదు చేశారంట అక్కడి పోలీసులు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
Also Read:
RRR Leaked photo : ‘ఆర్ఆర్ఆర్’మూవీ షూటింగ్ నుంచి లీకైన ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్..