AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agent Movie: అఖిల్‌ ఏజెంట్‌ వాయిదా పడనుందా.? అధికారికంగా స్పందించిన నిర్మాత.. ఏమన్నారంటే..

Agent Movie: అక్కినేని నట వారసుడు అఖిల్‌ హీరోగా, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఏజెంట్‌'. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండడం, అఖిల్‌ రా ఏజెంట్‌గా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు...

Agent Movie: అఖిల్‌ ఏజెంట్‌ వాయిదా పడనుందా.? అధికారికంగా స్పందించిన నిర్మాత.. ఏమన్నారంటే..
Narender Vaitla
|

Updated on: May 18, 2022 | 11:08 AM

Share

Agent Movie: అక్కినేని నట వారసుడు అఖిల్‌ హీరోగా, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏజెంట్‌’. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండడం, అఖిల్‌ రా ఏజెంట్‌గా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అన్నట్లు కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా సురేందర్‌ రెడ్డి కూడా ఏజెంట్‌ను తప్పుకున్నాడంటూ వార్తలు తెగ వైరల్‌ అయ్యాయి.

దీంతో ఈ వార్తలపై ఎట్టకేలకు స్పందించారు నిర్మాత అనిల్‌ సుంకర. ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాపై జరుగుతోన్న రూమర్లపై స్పందించిన అనిల్‌.. ‘ఏజెంట్ సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలోనే మనాలీలో ప్రారంభం కానుంది. టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నాము. అప్‌డేట్స్‌ కోసం అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్లను మాత్రమే ఫాలో అవ్వండి. దయచేసి ఎలాంటి పుకార్లను నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ సినిమా వాయిదా పడనుంది అని జరిగిన ప్రచారానికి చెక్‌ పడినట్లైంది.

ఇదిలా ఉంటే అఖిల్‌ ఏజెంట్‌ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ కనిపించని రీతిలో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో అదరగొట్టాడు. ఇక మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అఖిల్‌ ఈ సినిమాతో ఎలాంటి వండర్‌ క్రియేట్‌ చేస్తాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్