AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chor Bazaar Movie: విడుదల తేదీని ప్రకటించిన ‘చోర్‌ బజార్‌’ మూవీ యూనిట్‌.. ‘బచ్చన్‌ సాబ్‌’ వచ్చేది ఆరోజే..

Chor Bazaar Movie: పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కిన చిత్రం 'చోర్‌ బజార్‌'. దళం, జార్జ్‌ రెడ్డి వంటి సినిమాలతో తనదైన మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు జీవన్‌ రెడ్డి ఈ సినిమాకు...

Chor Bazaar Movie: విడుదల తేదీని ప్రకటించిన 'చోర్‌ బజార్‌' మూవీ యూనిట్‌.. 'బచ్చన్‌ సాబ్‌' వచ్చేది ఆరోజే..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jun 13, 2022 | 8:28 PM

Share

Chor Bazaar Movie: పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. దళం, జార్జ్‌ రెడ్డి వంటి సినిమాలతో తనదైన మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు జీవన్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ‘మెహబూబా’తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఆకాష్‌ తర్వత వచ్చిన ‘రొమాంటిక్‌’తో మరో పరజయాన్ని మూటగట్టుకున్నాడు. దీంతో ‘చోర్‌ బజార్‌’తో ఎలాగైన తొలి కమర్షియల్‌ విజయాన్ని అందుకోవాలనే కసితో ఉన్నాడు. దర్శకుడు జీవన్‌ రెడ్డి దీనికి అనుగుణంగానే ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్‌ హంగులతో రూపొందించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి.

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ నేపథ్యంలో.. చోరికి గురైన ఓ డైమండ్‌ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇందులో ఆకాశ్‌ ‘బచ్చన్‌ సాబ్’ పాత్రలో కనిపిస్తున్నాడు. ఆకాశ్‌కు జోడిగా గెహన సిప్పీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈనెల 24న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక తొలి రెండు చిత్రాలను వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథాంశాలను ఇతివృత్తంగా చేసుకొని తెరకెక్కించిన జీవన్‌ రెడ్డి తొలిసారి ఫుల్‌ లెంగ్త్‌ కమర్షియల్‌ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా జీవన్‌ రెడ్డికి ఎలాంటి ఇమేజ్‌ను అందిస్తుందో చూడాలి.

చోర్ బజార్ ట్రైలర్.. 

ఇవి కూడా చదవండి

ఇక యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు వీ.ఎస్‌ రాజు నిర్మాతగా వ్యవహరించారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ సమర్పిస్తుండడం కూడా ఈ సినిమాపై బజ్‌ రావడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. జగదీష్‌ చీకటి సినిమాటోగ్రఫీగా వ్యవహరించిన ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్ అప్డేట్.. పీఎఫ్ ఖాతాదారులకు బడ్జెట్‌లో గుడ్‌న్యూస్..?
బిగ్ అప్డేట్.. పీఎఫ్ ఖాతాదారులకు బడ్జెట్‌లో గుడ్‌న్యూస్..?
అవి అమ్మేసి చాలా పెద్ద తప్పు చేశా..!
అవి అమ్మేసి చాలా పెద్ద తప్పు చేశా..!
చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?
చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?
పోలీసులమంటారు.. బంగారం దోపిడి చేస్తారు.. పాలమూరులో నయా ముఠా
పోలీసులమంటారు.. బంగారం దోపిడి చేస్తారు.. పాలమూరులో నయా ముఠా
వీరు జామపండు అస్సలు తినకూడదు..!
వీరు జామపండు అస్సలు తినకూడదు..!
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్
అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి చీకటి చరిత్ర!నిజాలు తెలిస్తే
అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి చీకటి చరిత్ర!నిజాలు తెలిస్తే
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాకు హర్షవర్దన్ రెమ్యునరేషన్ ఎంతంటే?
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాకు హర్షవర్దన్ రెమ్యునరేషన్ ఎంతంటే?
హైదరాబాద్‌ శివారులో స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు
హైదరాబాద్‌ శివారులో స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు
బడ్జెట్ ముందుగానే లీక్.. ఆర్ధికశాఖ మంత్రి రాజీనామా.. ఎప్పుడంటే..?
బడ్జెట్ ముందుగానే లీక్.. ఆర్ధికశాఖ మంత్రి రాజీనామా.. ఎప్పుడంటే..?