‘గల్వాన్’‌ ఘటనపై మూవీ ప్రకటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ నటుడు

గతేడాది 15న లదాక్‌లోని గాల్వన్‌‌ వ్యాలీ వద్ద భారత సైన్యంపై చైనా ఆర్మీ జరిపిన దాడిలో 20 మంది భారతీయ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 3:09 pm, Sat, 4 July 20
'గల్వాన్'‌ ఘటనపై మూవీ ప్రకటించిన 'ఆర్‌ఆర్‌ఆర్' నటుడు

గతేడాది 15న లదాక్‌లోని గాల్వన్‌‌ వ్యాలీ వద్ద భారత సైన్యంపై చైనా ఆర్మీ జరిపిన దాడిలో 20 మంది భారతీయ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చైనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చైనా, మనదేశంలో పెడుతున్న పెట్టుబడుల నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. అలాగే ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను బ్యాన్‌ చేసింది. ఇక ఇప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే గల్వాన్ వ్యాలీ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగన్‌ వెల్లడించారు. అంతేకాదు ఈ మూవీ కోసం ఇప్పటికే నటీనటులను ఎంచుకున్నట్లు అజయ్ తెలిపారు. ఇక ఈ మూవీని అజయ్‌ దేవగన్‌ ఫిల్మ్స్‌, సెలెక్ట్‌ మీడియా హైల్డింగ్‌ ఎల్‌ఎల్‌పీలు సంయుక్తంగా నిర్మించనున్నారు. అయితే ఇందులో అజయ్‌ నటిస్తారా..? లేదా నిర్మాతగానే పరిమితం అవుతారా..? అన్నది తెలియాల్సి ఉంది.