Adivi Sesh Rescues Kitten: అనాథపిల్లి పిల్లను ఇంటికి తీసుకెళ్లిన అడవి శేషు.. దానిని దత్తత తీసుకుంటానన్న రేణు దేశాయ్
టాలీవుడ్ లో మల్టీటాలెంటెడ్ పర్సన్ గా ఇప్పటికే మంచి పేరు అడవి శేష్ సొంతం.. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు గొప్ప ఉదారత ఉన్న వ్యక్తిగా వార్తల్లో..
Adivi Sesh Rescues Kitten: టాలీవుడ్ లో మల్టీటాలెంటెడ్ పర్సన్ గా ఇప్పటికే మంచి పేరు అడవి శేష్ సొంతం.. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు గొప్ప ఉదారత ఉన్న వ్యక్తిగా వార్తల్లో నిలిచేటట్లు చేసింది. ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. అడవి శేషు ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు మీద ఉన్న ఒక పిల్లిని చూసి తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లినట్లు చెప్పాడు.. ఆ పిల్లి చలితో పాటు… ట్రాఫిక్ లో ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులు పడిందని.. తెలిపాడు. ఆ పిల్లి పిల్ల, తల్లి కనిపించకపోవడంతో తనతో పాటు ఇంటికి తీసుకుని వచ్చి ఆహారం పెట్టానని పోస్ట్ చేశాడు.
అడవి శేషు చేసిన పనిని నెటిజన్లు ప్రశంసలతో ముంచేస్తుంటే.. మరోవైపు రేణుదేశాయ్ స్పందించారు. పిల్లిపిల్లను కాపాడినందుకు శేషు కు థాంక్స్ చెప్పిన రేణు.. దానిని తాను దత్తత తీసుకుంటానని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
Also Read: