AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. కట్టుకున్న భర్త చేతిలో నరకం.. కట్ చేస్తే

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ అగ్ర తార.. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆమె.. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె సులక్షణ. సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా రాణించిన ఆమె నిజజీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు చూశారు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. కట్టుకున్న భర్త చేతిలో నరకం.. కట్ చేస్తే
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2026 | 6:20 PM

Share

సులక్షణ తెలుగు, తమిళ సినీ రంగాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభోదయం చిత్రంలో చంద్రమోహన్ సరసన ఆమె “గంధము పూయరుగా”, “కంచికి పోతావా కృష్ణమ్మ” వంటి మధురమైన పాటలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అంతేకాకుండా, కే. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం సింధుభైరవిలో కూడా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఆమె అద్భుతమైన పాత్రలలో కనిపించారు. సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా రాణించిన సులోచన నిజజీవితంలో ఎన్నో కష్టాలను చూశారు. ఏంఎస్ విశ్వనాథం కుమారుడు గోపికృష్ణ సులోచనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో రెండు కుటుంబాలు ఒప్పుకోనప్పటికీ ఆ తర్వాత ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

పెద్ది తర్వాత ఆమె భర్త గోపికృష్ణ ఆమెకు నరకం చూపించాడు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్త సులోచనను వేధించడం మొదలుపెట్టారు. దాంతో ఆమె పిల్లలతో సహా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. పెళ్లి తర్వాత సినిమాలు చేయని సులోచనకు బయట ఎవ్వరూ ఇల్లు ఇవ్వలేదు. ఓ వ్యక్తి దైర్యం చేసి ఇల్లు అద్దెకు ఇచ్చాడు. కాగా పిల్లను పోషించడానికి ఆమె తన నగలు అన్ని అమ్మేసింది. చివరకు సీరియల్స్ లో నటించింది.. దాంతో కొన్నేళ్ల పాటు సీరియల్స్ చేసి పిల్లలను పెంచి పెద్ద చేసింది సులక్షణ.

పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఆమెకు పిల్లలు ఓ పెద్ద ఇల్లు కొనిచ్చారు. ఆ ఇంటి గృహప్రవేశానికి మాజీ భర్తను ఆహ్వానించింది. అప్పటికీ గోపికృష్ణకు రెండో పెళ్లి అయ్యింది. గోపికృష్ణ ఆయన భార్య సులోచన ఇంటి గృహప్రవేశానికి వచ్చి చూసి షాక్ అయ్యారు. పిల్లల పెళ్లి కూడా చేశారు సులోచన. ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని సులక్షణ నిరూపించారు. భర్త తోడు లేకపోయినా ముగ్గురు పిల్లలను పెంచి పోషించి చూపించారు సులక్షణ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us