Shriya Saran: పెళ్లినాటి వీడియో షేర్ చేసిన శ్రియా.. రంగుల్లో మునిగితేలుతూ భర్తతో రొమాంటిక్ డ్యాన్స్.. Viral Video
Shriya Saran Dance Video: టాలీవుడ్‌లో వచ్చిన 'ఇష్టం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార శ్రియా శరణ్. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది రెండో చిత్రంతోనే..
Shriya Saran Dance Video: టాలీవుడ్‌లో వచ్చిన ‘ఇష్టం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార శ్రియా శరణ్. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది రెండో చిత్రంతోనే నాగార్జున వంటి బడా హీరో సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక అనంతరం వెనక్కి తిరిగి చూడని శ్రియా వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. 20 ఏళ్ల సుధీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లోని దాదాపు అందరు టాప్ హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ. బాలీవుడ్‌తో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించింది. ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చేవ్ అనే వ్యాపారవేత్తను వివాహమాడిందీ ముద్దుగుమ్మ. వివాహం తర్వాత సినిమాల వేగాన్ని బాగా తగ్గించేసిన శ్రియా ఆచి చూతి నిర్ణయం తీసుకుంటోంది. చివరిసారిగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో నటించిన శ్రియా మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు. అయితే సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది శ్రియా. ముఖ్యంగా భర్త ఆండ్రీతో గడిపిన సంతోష క్షణాలను శ్రియా ఇటీవల సోషల్ మీడియాలో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా హోలీ పండగను పురస్కరించుకొని ఈ అందాల తార వివాహ సమయంలో రంగులతో ఆడిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో పూర్తిగా రంగుల్లో మునిగిపోయిన శ్రియా.. భర్తతో కలిసి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి భర్తతో కలిసి శ్రేయా చేసిన ఈ రొమాంటిక్ డ్యాన్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
శ్రియా పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
View this post on Instagram
RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్ప్రైజ్ .. ఈసారి ఆ స్టార్ హీరో లుక్ రాబోతుందా ?