AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌కు కరోనా గురించే ముందే తెలుసా.? నెట్టింట నవ్వులు పూయిస్తోన్న వీడియో మీమ్‌.

Bobby Deol Viral Video: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ డేంజరస్ వైరస్‌ కారణంగా మానవ జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎవరో ఒకరు మాత్రమే మాస్కులు..

Viral Video: బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌కు కరోనా గురించే ముందే తెలుసా.? నెట్టింట నవ్వులు పూయిస్తోన్న వీడియో మీమ్‌.
Bobby Deol Viral Video
Narender Vaitla
|

Updated on: Mar 30, 2021 | 3:11 PM

Share

Bobby Deol Viral Video: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ డేంజరస్ వైరస్‌ కారణంగా మానవ జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎవరో ఒకరు మాత్రమే మాస్కులు పెట్టుకొని దర్శనమిచ్చేవారు. కానీ ఈ వైరస్‌ పుణ్యామాని మాస్కు లేని వారిని భూతద్దంలో వెతికినా కనిపించడం లేదు. అంతేనా.. చేతులను పదే పదే కడుక్కోవడం, శానిటైజర్‌ను ఉపయోగించడం ఇలా ఎన్నో కొత్త అలవాట్లను తప్పనిసరి చేసిందీ వ్యాధి. ఇదిలా ఉంటే.. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ముక్కులో బడ్‌ను పెట్టి ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేయడం, మాస్కు ధరించడం, క్వారంటైన్‌లో ఉండడం, హ్యాండ్‌ వాష్ చేసుకోవడం ఇలా కరోనా నియంత్రణ చర్యలన్నింటినీ బాలీవుడ్‌ హీరో బాబీ డియోల్‌ 30 ఏళ్ల క్రితమే చెప్పాడనే ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయమేంటంటే.. బాబీ డియోల్‌ నటించిన కొన్ని సినిమాల్లో పైన తెలిపిన కరోనా నియంత్రణలను పోలిన ఫన్నీ క్లిప్స్‌ అన్నింటినీ ఓ చోట చేర్చి కొందరు మీమర్స్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా బాబీ డియోల్‌ ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేస్తున్నట్లు.. నటి ఐశ్యర్య రాయి ముక్కులో బడ్‌ పెట్టడం, క్వారంటైన్‌కు సూచికగా డోర్‌ వేసుకొని గదిలో ఉండడం లాంటి వీడియోలు నవ్వులు పూయిస్తున్నాయి. ‘ది ఇండియన్‌ మీమ్స్‌’ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..

Also Read: Anu Emmanuel Love Story: అను ఇమ్మాన్యుయేల్‌ ప్రేమలో ఉంది ఈ మెగా హీరోతోనేనా.? ఈ పోస్టే దీనికి నిదర్శనమా..?

Konidela Niharika Holi: భర్త, కజిన్స్ తో కలిసి హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్న నిహారిక.. నాజీవితానికి రంగులను అద్దింది వీరే…

Nithiin BirthDay: ఫ్యామిలీతో నితిన్ బర్త్ డే వేడుకలు.. సందడి చేసిన సింగర్ సునీత దంపతులు..