AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konidela Niharika Holi: భర్త, కజిన్స్ తో కలిసి హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్న నిహారిక.. నాజీవితానికి రంగులను అద్దింది వీరే…

Konidela Niharika Holi: హిందువుల ముఖ్యమైన పండగల్లో హోలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండగను కులమతాలకు అతీతంగా చిన్న పెద్దా అందరూ కలిసి సంతోషంగా కరోనా నిబంధనాలను పాటిస్తూ జరుపుకున్నారు..

Konidela Niharika Holi: భర్త, కజిన్స్ తో కలిసి హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్న నిహారిక.. నాజీవితానికి రంగులను అద్దింది వీరే...
Niharika Konidela Holi
Surya Kala
|

Updated on: Mar 30, 2021 | 2:36 PM

Share

Konidela Niharika Holi: హిందువుల ముఖ్యమైన పండగల్లో హోలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండగను కులమతాలకు అతీతంగా చిన్న పెద్దా అందరూ కలిసి సంతోషంగా కరోనా నిబంధనాలను పాటిస్తూ జరుపుకున్నారు. రంగులను చల్లుకుంటూ.. సంతోషంగా గడిపారు. ఇక సెలబ్రెటీలు కూడా తమ ఫ్యామిలీ సభ్యులతో హొలీ పండగనాడు రంగుల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈసారి తమ ఇంటికి మాత్రమే హొలీ వేడుకలను పరిమితం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నటీనటుల హొలీ వేడుకల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయ కూడా హొలీ సెలబ్రేషన్స్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మెగాఫ్యామిలీ ఇంట్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తన భర్త చైతన్య జొన్నలగడ్డ తో కలిసి నీహారిక హొలీ వేడుకలను జరుపుకుంది. నీహారిక పెళ్లి తర్వాత వచ్చిన మొదటి హొలీ పండగ.. ఈ నేపథ్యంలో తన భర్త, స్నేహహితులు, కుటుంబ సభ్యుల మధ్య హోలీని జరుపుకుంది. మెగా స్టార్ చిరంజీవి ముద్దుల తనయ శ్రీజ కూడా హొలీ వేడుకల్లో పాల్గొంది. చెల్లెలతో కలిసి రంగు నీళ్ళ‌ల్లో త‌డుస్తూ ఒక‌రిపై ఒక‌రు నీళ్ళు చ‌ల్లుకుంటూ హోలీని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఇది పెళ్లి తర్వాత త‌న‌కు మొద‌టి హోలీ సెల‌బ్రేష‌న్ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నీహారిక తెలిపింది. హొలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వీరందరూ నా జీవితాన్ని రంగుల మయం చేశారు అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Also Read: కోరిన వరాలిచ్చే వైష్ణవి దేవికి 20 ఏళ్లలో భక్తులు 1,800కేజీల బంగారం కానుకలు.. మరి నగదు, తెలిస్తే షాక్

Currency Bundles : పొద్దున్నే పంచాయతీ కార్మికులు షాక్ ఇచ్చిన డబ్బులు.. చెత్త ఎత్తే కొద్దీ కరెన్సీ కట్టలు.. ఆపై