15 సంవత్సరాలైనా ప్రతి సినిమా నాకు కొత్తే.. షూటింగ్ అంటే ఆకలితో ఉన్న పిల్లాడిలా మారిపోతా అంటున్న గ్లామర్ బ్యూటీ..

Aditi Rao Hydari : ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదిహేను సంవత్సరాలు గడిచినా.. ఇప్పటికి ప్రతి సినిమా కొత్తగానే ఉంటుందని చెబుతుంటుంది హీరోయిన్ అదితి రావు హైదరి.. ఈ సందర్భంగా ఓ సినిమా ఛానెల్‌కిచ్చిన

15 సంవత్సరాలైనా ప్రతి సినిమా నాకు కొత్తే.. షూటింగ్ అంటే ఆకలితో ఉన్న పిల్లాడిలా మారిపోతా అంటున్న గ్లామర్ బ్యూటీ..
Aditi Rao Hydari
Follow us
uppula Raju

|

Updated on: Mar 30, 2021 | 3:33 PM

Aditi Rao Hydari : ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదిహేను సంవత్సరాలు గడిచినా.. ఇప్పటికి ప్రతి సినిమా కొత్తగానే ఉంటుందని చెబుతుంటుంది హీరోయిన్ అదితి రావు హైదరి.. ఈ సందర్భంగా ఓ సినిమా ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ”సెట్లోకి అడుగుపెట్టినప్పుడు చాలా టెన్షన్‌గా ఫీలవుతాను నేను చేసేది ప్రతీది కొత్తగానే అనిపిస్తోంది. దర్శకుడు చెప్పినప్పుడు ఏమి చేయాలో అర్థం కాదనిపిస్తోంది కానీ కరెక్ట్‌గా చేస్తాను ఆ పాత్ర ఏమీటో నాకు తెలియదు.. అలాంటప్పుడు ఆ పాత్రకి సరైన న్యాయం చేయగలనా అని అనుమానం ఉంటుంది. దర్శకుడి ముఖం మీద చిరునవ్వు చూస్తానా లేదా అని అయోమయంగా ఫీలవుతానని” చెప్పుకొచ్చింది..

”సినిమా ప్రారంభించడానికి రెండు రోజుల ముందు నేను ఎలా ఉంటాను అంటే? ఆకలితో ఉన్న చిన్నపిల్లవాడిలా మారిపోతా. ఒక్క చోట నిశ్శబ్దంగా కుదురుగా కూర్చోలేను. ఆకలితో ఉన్న చిన్నపిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో మీకు తెలుసా? అలా నేను ప్రవర్తిస్తాను’’ అని తెలిపింది. ‘చెలియా’ ‘నవాబ్’ సినిమాలతో సౌత్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి.. తెలుగు ప్రేక్షకులకు ‘సమ్మోహనం’ సినిమాతో మరింత దగ్గరైంది. ప్రస్తుతం ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్‌లో మాస్‌ మహారాజ‌్‌ రవితేజ హీరోగా తెరకెక్కనున్న ‘మహాసముద్రం’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో ‘శ్రీరంగం’ చిత్రంలోని ప్రధాన పాత్ర అయిన మధురగా అలరించింది. ‘ఢిల్లీ-6’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి ‘ధోబి ఘాట్‌’, ‘రాక్‌స్టార్‌’, ‘గుడ్డు రంగీలా’వంటి సినిమాలు చేసింది.

Anu Emmanuel Love Story: అను ఇమ్మాన్యుయేల్‌ ప్రేమలో ఉంది ఈ మెగా హీరోతోనేనా.? ఈ పోస్టే దీనికి నిదర్శనమా..?

RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‏ప్రైజ్ .. ఈసారి ఆ స్టార్ హీరో లుక్ రాబోతుందా ?

Konidela Niharika Holi: భర్త, కజిన్స్ తో కలిసి హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్న నిహారిక.. నాజీవితానికి రంగులను అద్దింది వీరే…

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!