Sai pallavi: ‘టాలీవుడ్‌లో ఆ ఇద్దరు నన్ను చాలా కేరింగ్‌గా చూసుకుంటారు’.. సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

| Edited By: Anil kumar poka

Jun 30, 2022 | 12:20 PM

Sai pallavi: పేరుకు మలయాళీ నటి అయినప్పటికీ తెలుగమ్మాయిలా మారిపోయింది నటి సాయిపల్లవి. తెలుగులో అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత...

Sai pallavi: టాలీవుడ్‌లో ఆ ఇద్దరు నన్ను చాలా కేరింగ్‌గా చూసుకుంటారు.. సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Follow us on

Sai pallavi: పేరుకు మలయాళీ నటి అయినప్పటికీ తెలుగమ్మాయిలా మారిపోయింది నటి సాయిపల్లవి. తెలుగులో అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్‌లో నటిస్తోన్న సాయిపల్లవి సినిమా, సినిమాకు తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతోంది. ఇటీవల విరాపటర్వంలో నటించిన ఈ చిన్నది ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాలో నిత్యం సందడి చేసింది. తెలుగులోనే మాట్లాడడంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది.

ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో తనకు రానా, నాగచైతన్య బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పుకొచ్చింది. వీరిద్దరు తనను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ కేర్‌ తీసుకుంటారని తెలిపింది. సాయిపల్లవి వీరిద్దరితో నటించిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో లవ్‌స్టోరీలో నటించిన సాయి, రానాతో తాజాగా విరాటపర్వంలో తళుక్కుమంది.

ఇలా వీరిద్దరితో మంచి ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడిందని తెలిపిందీ బ్యూటీ. ఇక సాయిపల్లవి ప్రస్తుతం గార్గి చిత్రంలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్‌ లుక్‌ చూస్తూంటే ఈ సినిమాలో కూడా సాయి పల్లవి నటనకు అత్యంత ప్రాధానత్య ఉన్న పాత్రలో ఆమె నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టెన్త్ క్లాస్ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..