AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: అలా అయితే ప్రేక్షకులకు కూడా బోర్‌ కొడుతుంది: సాయి పల్లవి

ఆ తర్వాత 2017లో వచ్చిన ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ మూవీ. తొలి సినిమాతోనే తనదైన నటనతో మెస్మరైజ్‌ చేసింది. ఫిదా సినిమాతో నిజంగానే ప్రేక్షకులను ఫిదా చేసింది సాయి పల్లవి. ఇక అప్పటి నుంచి తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. కమర్షియల్ చిత్రాలకు వీలైనంత...

Sai Pallavi: అలా అయితే ప్రేక్షకులకు కూడా బోర్‌ కొడుతుంది: సాయి పల్లవి
Sai Pallavi
Narender Vaitla
|

Updated on: Aug 25, 2024 | 9:01 AM

Share

సాయి పల్లవి.. ఈ పేరు వినగానే నటనకు పర్యాయపదం అనిపిస్తుంది. గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 2005లో వచ్చిన కస్తూరి మాన్‌ అనే తమిళ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ.

ఆ తర్వాత 2017లో వచ్చిన ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ మూవీ. తొలి సినిమాతోనే తనదైన నటనతో మెస్మరైజ్‌ చేసింది. ఫిదా సినిమాతో నిజంగానే ప్రేక్షకులను ఫిదా చేసింది సాయి పల్లవి. ఇక అప్పటి నుంచి తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. కమర్షియల్ చిత్రాలకు వీలైనంత వరకు దూరంగా ఉండే సాయిపల్లవి కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ వస్తోంది.

అయితే సాయిపల్లవి ఇలా నటనకు మాత్రమే ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడానికి ఏమైనా ప్రత్యేక ప్రణాళికలున్నాయా అంటే అలాంటిది ఏం లేదని చెబుతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఈ విషయాలను వెల్లడించింది. సినిమాలను జోనర్‌ పేరుతో వర్గీకరించడం తనకు నచ్చదని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు, కమర్షియల్ చిత్రాలనే తేడా ఉండదని తెలిపింది.

ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుందో, ఏ సినిమా నచ్చదో ముందే చెప్పలేమన్న సాయి పల్లవి.. తాను ఏ సినిమా చేసినా, పది కాలాలు గుర్తుండిపోయేలా ఉండాలని అనుకుంటానని తెలిపింది. హెవీ రోల్స్‌ చేయడం అంత సులభమైన విషయం కాదన్న సాయిపల్లవి.. లోలోపల చాలా ఒత్తిడిగా అనిపిస్తుందని తెలిపింది. అందుకే సరదాగా సాగిపోయే లైట్‌ పాత్రల్లో నటించాలని ఉందని తెలిపింది. అయితే కమర్షియల్ చిత్రాల్లో నటించినా.. కొత్తదనం ఉండేలా చూసుకుంటానని చెప్పుకొచ్చింది. లేదంటే నటిగా తనకే కాకుండా, చూసే ప్రేక్షకులకు కూడా బోర్‌ కొడుతుందని తెలిపింది. మంచి కథలు దొరికితే పూర్తి స్థాయి కామెడీ, యాక్షన్‌ పాత్రలు చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో..
బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో..
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్