Rakul Preet Singh: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. బయోపిక్‌ వార్తలపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Oct 07, 2021 | 7:36 PM

Rakul Preet Singh: 2011లో 'కెరటం' అనే చిన్న చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అనంతరం తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్గుగుమ్మ తెలుగులో రెండో చిత్రంగా..

Rakul Preet Singh: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. బయోపిక్‌ వార్తలపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

Rakul Preet Singh: 2011లో ‘కెరటం’ అనే చిన్న చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అనంతరం తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్గుగుమ్మ తెలుగులో రెండో చిత్రంగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’లో నటించింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రకుల్‌ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ విజయం ఇచ్చిన కిక్‌తో రకుల్‌కు వరుస బడా ఆఫర్లు క్యూకట్టాయి. టాలీవుడ్‌లో దాదాపు అందరు యంగ్‌ టాప్‌ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఈ చిన్నది అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఏకంగా చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉందీ చిన్నది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ నటిస్తోన్న తాజా చిత్రం ‘కొండపాలం’ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్‌ 8న విడుదలవుతోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రచారకార్యక్రమాల వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే రకుల్‌ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ అమ్మడు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ.. ‘కొండపొలం’ చూడటానికి ఈజీగా ఉంటుంది. కానీ, షూట్‌ చేయడం చాలా కష్టమైందని తెలిపింది. ఇక ఈ నెల 10న రకుల్‌ పుట్టిన రోజు. అయితే.. ఈసారి వేడుకలకు దూరంగా ఉంటానని రకుల్ చెప్పుకొచ్చింది. ఇక గతకొన్ని రోజులుగా తాను కరణం మల్లీ్‌శ్వరీ బయోపిక్‌లో నటిస్తున్నాననే ప్రచారం జరుగుతుందని, కానీ దాంట్లో ఏమాత్రం నిజం లేదని రకుల్‌ తేల్చి చెప్పింది. ఇక తనకు డ్రీమ్‌ రోల్ అంటూ ఏమీ లేదని.. ఒక్క సినిమా చేస్తే అది జీవితాంతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలని తెలిపింది. ఒక దిల్‌ వాలే దుల్హానియా లేజాయేంగే, ఒక ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేస్తే చాలనిపిస్తోందని రకుల్‌ మనసులో మాట చెప్పేసింది.

Also Read: Samantha Ruth Prabhu: గేమ్ షోలో పెద్దమొత్తంలో గెలుచుకున్న సమంత.. ఆ డబ్బును ఏం చేసిందో తెలుసా..

Vaishnav Tej : ఆ స్టార్ హీరోల కథలను ఎంచుకోవలని ఉంది.. మనసులో మాట చెప్పిన వైష్ణవ్ తేజ్..

Taapsee Pannu: టాలీవుడ్ టూ బాలీవుడ్ అదరగొట్టిన తాప్సీ.. సోషల్ మీడియాలో ఫొటోస్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu