Hansika: వామ్మో.. పెళ్లి కూతురు హంగామా మాములుగా లేదు.. అక్కడ స్నేహితులతో కలిసి రచ్చ చేస్తోన్న హన్నిక..
దేశ ముదురు చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల తార హన్సిక పెళ్లి పీటలెక్కుతోన్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ను హన్సిక వివాహమాడనుంది. డిసెంబర్ 4వ తేదీన జైపూర్‌లోని ముంటోడా ప్యాలెస్‌లో బంధుమిత్రుల సమక్షంలో హన్సిక వివాహం చేసుకోనుంది...
దేశ ముదురు చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల తార హన్సిక పెళ్లి పీటలెక్కుతోన్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ను హన్సిక వివాహమాడనుంది. డిసెంబర్ 4వ తేదీన జైపూర్‌లోని ముంటోడా ప్యాలెస్‌లో బంధుమిత్రుల సమక్షంలో హన్సిక వివాహం చేసుకోనుంది. వివాహం దగ్గరపడుతోన్న తరుణంలో హన్సిక సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. కాబోయే వాడితో ప్యారిస్‌లో దిగిన ఫొటోలను పోస్ట్ చేసిందీ బ్యూటీ. దీంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట తెగ సందడి చేశాయి. ఇక ప్రస్తుతం హన్సిక తన బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేస్తోంది.
స్నేహితురాళ్లతో కలిసి విదేశాల్లో బ్యాచిలర్స్ పార్టీలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది హన్సిక. ఈ అందాల తార చేసిన హంగామా ఓ రేంజ్‌లో ఉంది. స్నేహితురాళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం గ్రీస్‌లో ఉన్న హన్సిక తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియోలో హన్సిక గ్లామర్ డోస్‌ను కూడా పెంచేసింది. వైట్ డ్రస్‌లో హాట్ హాట్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తోంది. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఇదిలా ఉంటే హన్సిక వివాహం రాజస్థాన్ లోని జైపూర్‌లో ప్యాలెస్‌లో జరగనుంది. పెళ్లికి రెండు రోజుల ముందుగానే మెహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇటీవల తన ప్రియుడిని ఇన్ స్టా వేదికగా అభిమానులకు పరిచయం చేసిన హన్సిక వివాహ బంధంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..