AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీలీల.. ఏకంగా సూపర్‌ స్టార్‌ సరసన..?

పెళ్లిసందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార శ్రీలీల. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసిందీ బ్యూటీ. ఒక్కసినిమాతోనే వంద సినిమాల పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి...

Sreeleela: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీలీల.. ఏకంగా సూపర్‌ స్టార్‌ సరసన..?
Sreeleela
Narender Vaitla
|

Updated on: Nov 27, 2022 | 5:00 PM

Share

పెళ్లిసందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార శ్రీలీల. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసిందీ బ్యూటీ. ఒక్కసినిమాతోనే వంద సినిమాల పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అనతి కాలంలోనే ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మారుమోగింది. బడా హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకంటూ బిజీగా మారిపోయిందీ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈ బ్యూటీ ఏకంగా 5 చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

రవితేజ ధమాకా, నితిన్‌-వక్కంతం వంశీ ప్రాజెక్ట్‌, నవీన్‌ పొలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు వంటి చిత్రాల్లో నటిస్తోందీ బ్యూటీ. వీటితో పాటు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలోనూ నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం శ్రీలీలా మరో క్రేజీ ఆఫర్‌ను కొట్టేసినట్లు తెలుస్తోంది. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో శ్రీలీల నటించనున్నట్లు సమాచారం. ఈ విషయమై మేకర్స్‌ ఇప్పటికే ఈ ముద్దుగుమ్మను అడగ్గా దానికి శ్రీలీలా ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది.

మహేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాలో మహేష్‌ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ కోసం శ్రీలీలాను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే శ్రీలీలా నిజంగానే లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..