Namrata: సూపర్ స్టార్ గురించి మహేష్ సతీమణి ఎమోషనల్ పోస్ట్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన నమ్రత..

హైదరాబాద్ JRC కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో మహేశ్ బాబు హాజరయ్యారు. మీ అభిమానం తన తోడుగా ఉండాలి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు మహేష్‌బాబు. కృష్ణ గారు ఎప్పుడు మీ గుండెల్లో.. నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పారు మహేశ్.

Namrata: సూపర్ స్టార్ గురించి మహేష్ సతీమణి ఎమోషనల్ పోస్ట్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన నమ్రత..
Krishna With Mahesh Babu Fa
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 27, 2022 | 5:55 PM

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర ప్రత్యేకం. ఇండస్ట్రీలో ఎన్నో సాహసాలకు మారు పేరు. అంతేకాదు.. చిత్రపరిశ్రమకు సాంకేతికతను పరిచయం చేశారు. దాదాపు 350కి పైగా సినిమాలతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మూగపోయింది. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఘట్టమనేని ఫ్యామిలీ.. ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కృష్ణ మృతితో ఇండస్ట్రీలో మహా అధ్యాయం ముగిసింది. తండ్రి మృతితో మహేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా మహేష్ చేసిన పోస్ట్ అందరి హృదయాలను కదిలించింది. ఇక ఈరోజు కృష్ణ దశ దిన కర్మ నిర్వహించారు ఘట్టమనేని కుటుంబసభ్యులు. హైదరాబాద్ JRC కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో మహేశ్ బాబు హాజరయ్యారు. మీ అభిమానం తన తోడుగా ఉండాలి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు మహేష్‌బాబు. కృష్ణ గారు ఎప్పుడు మీ గుండెల్లో.. నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పారు మహేశ్.

మరోవైపు సోషల్ మీడియా వేదికపై తన మావయ్య సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు నమ్రత. “ఎవర్‌గ్రీన్ స్టార్. ఎన్నింటికో పునాదులు వేసి నిజమైన ట్రెండ్‌సెట్టర్ గా నిలిచారు.. సినిమాపై ఆయనకున్న ప్రేమ ఆయన్ను సూపర్ స్టార్‌గా మార్చింది. మీ నుంచి జీవితంలోని ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నాను. ఆయన అపూర్వ వారసత్వాన్ని, ఖ్యాతిని ఎప్పటికీ మేం పండగాల జరుపుకూనే ఉంటాం. లవ్ యూ మామయ్య గారూ.” అంటూ కృష్ణ సుధీర్ఘ జర్నీకి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక తండ్రి దూరమయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు మహేష్. “నీ జీవితం వేడుకగా గడచిపోయింది. నీ నిష్క్రమణం కూడా అంతే వేడుకగా సాగింది. అదే మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ స్వభావం.. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. విచిత్రమేమిటంటే, నేను ఇంతకు ముందెన్నడూ లేని శక్తిని నాలో అనుభవిస్తున్నాను.. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను.. అచ్చం మీలాగే.. నీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను.. నిన్ను మరింత గర్వపడేలా చేస్తాను… లవ్ యూ నాన్నా… మై సూపర్ స్టార్” అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే