టాలీవుడ్ ‘ఎమ్మెల్యే’కు వింత జబ్బు.. సంచలన నిర్ణయం

చబ్బీ చబ్బీ లుక్స్‌తో ఎమ్మెల్యేగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో స్థానం సాధించింది యంగ్ హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా. తెలుగులో ఈ అమ్మడి ఖాతాలో మంచి విజయాలు ఉన్నప్పటికీ.. అల్లు అర్జున్ మినహా మరే స్టార్‌ హీరోతోనూ జోడీ కట్టలేకపోయింది. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీకి మంచి ఆఫర్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ పేమస్ లవర్‌లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ తనకో వింత […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:49 am, Mon, 21 October 19
టాలీవుడ్ 'ఎమ్మెల్యే'కు వింత జబ్బు.. సంచలన నిర్ణయం

చబ్బీ చబ్బీ లుక్స్‌తో ఎమ్మెల్యేగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో స్థానం సాధించింది యంగ్ హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా. తెలుగులో ఈ అమ్మడి ఖాతాలో మంచి విజయాలు ఉన్నప్పటికీ.. అల్లు అర్జున్ మినహా మరే స్టార్‌ హీరోతోనూ జోడీ కట్టలేకపోయింది. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీకి మంచి ఆఫర్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ పేమస్ లవర్‌లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ తనకో వింత వ్యాధి ఉందని చెప్పుకొచ్చింది. ఆ జబ్బు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానని కూడా కేథరిన్ తెలిపింది. ఇంతకీ ఈ బ్యూటీకి వచ్చిన జబ్బు ఏంటో తెలుసా..! అనోస్మియ.

ఈ వ్యాధి ఉన్న వారు వాసన చూడలేరు. ఎంత సువాసన అయినా.. దుర్వాసన అయినా వారికి తెలీదు. వాసన చూసే శక్తి వారికి ఉండదు. ఇక ఈ జబ్బు ఉన్నందుకు ఆమె ఓ సంచలన నిర్ణయాన్ని కూడా తీసుకుందట. దీని వలన భవిష్యత్తులో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకూడదని భావిస్తుందట. ఇక ఈ జబ్బు ఉన్నా సినిమాల్లో నటించడానికి అది ఎప్పుడూ అడ్డు రాదని ఆమె తెలిపింది. అయితే లక్షల్లో ఒక్కరికి వచ్చే ఈ జబ్బు కేథరిన్‌కు రావడం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.