Anjali: ‘చక్కనమ్మా చిక్కినా అందమే’.. నెట్టింట వైరల్‌ అవుతోన్న అంజలి లేటెస్ట్‌ ఫొటోస్‌.. స్టన్నింగ్ లుక్‌లో తెలుగమ్మాయి..

Anjali: 2006లో వచ్చిన 'ఫొటో' అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార అంజలి. ఈ సినిమా తర్వాత మళ్లీ చాలా రోజుల పాటు తెలుగులో నటించలేదీ బ్యూటీ. వరుసగా తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి...

Anjali: 'చక్కనమ్మా చిక్కినా అందమే'.. నెట్టింట వైరల్‌ అవుతోన్న అంజలి లేటెస్ట్‌ ఫొటోస్‌.. స్టన్నింగ్ లుక్‌లో తెలుగమ్మాయి..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 28, 2022 | 10:34 AM

Anjali: 2006లో వచ్చిన ‘ఫొటో’ అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార అంజలి. ఈ సినిమా తర్వాత మళ్లీ చాలా రోజుల పాటు తెలుగులో నటించలేదీ బ్యూటీ. వరుసగా తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి బిజీగా గడిపింది. అనంతరం 2012లో వచ్చిన ‘సీతమ్మవాకిట్లో సిరి మల్లె చెట్టు’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. తర్వాత తెలుగులో అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ తమిళంలో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోయింది. ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో మళ్లీ బిజీ అవుతోందీ చిన్నది.

ఇటీవల నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న మాచర్చ నియోజకవర్గం చిత్రంలో ఐటెం సాంగ్‌లో ఆడిపాడిన ఈ బ్యూటీ రామ్‌ చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో అంజలి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా అవకాశాలు రాని సమయంలో ఇలా సరికొత్త పంథాల్లో మళ్లీ టాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విదేశాల్లో హాలీడే ఎంజాయ్‌ చేస్తోంది అంజలి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ లేటెస్ట్‌ ఫొటోస్‌ మాత్రం స్టన్నింగ్ లుక్‌లో ఆకట్టుకుంటోంది. పూర్తిగా సన్నగా మారి వావ్‌ అనిపించేలా ఉంది. దీంతో ఈ ఫొటోలు చూసిన అంజలి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. స్లిమ్‌ అయ్యాక అంజలి చాలా అందంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొత్త లుక్‌లో అంజలిని చూస్తుంటే చక్కనమ్మా చిక్కినా అందమే అన్నట్లు ఉంది కదూ!

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..