Ananya Nagalla: ‘నన్ను ఎవ్వడూ ట్రై చేయంది అందుకేనేమో’.. ఫ్యాన్స్‌తో అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు..
మల్లేశం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది అందాల తార అనన్య నాగళ్ల. తొలి సినిమాలో పూర్తిగా డీగ్లామర్ పాత్రలో గృహిణి పాత్రలో అద్భుత నటనను కనబరించిందీ బ్యూటీ. ఈ సినిమాలో అనన్య నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. అనంతరం ప్లేబ్యాక్ అనే ఇంట్రెస్టింగ్ మూవీలో నటించి మెప్పించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
మల్లేశం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది అందాల తార అనన్య నాగళ్ల. తొలి సినిమాలో పూర్తిగా డీగ్లామర్ పాత్రలో గృహిణి పాత్రలో అద్భుత నటనను కనబరించిందీ బ్యూటీ. ఈ సినిమాలో అనన్య నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. అనంతరం ప్లేబ్యాక్ అనే ఇంట్రెస్టింగ్ మూవీలో నటించి మెప్పించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ మూవీలో కీలకపాత్రలో నటించి తొలి కమర్షియల్ హిట్‌ను అందుకుందీ చిన్నది.
తాజాగా సమంత హీరోయిన్‌గా వచ్చిన శాకుంతలం చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పటి వరకు సినిమాల్లో పెద్దగా గ్లామర్ పాత్రలో కనిపించని అనన్య.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్‌ను బాగానే పెంచుతోంది. లేటెస్ట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనన్యను పది లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో రోజురోజుకీ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతోన్న అనన్య తాజాగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ‘జస్ట్ ఆస్క్’ అంటూ అభిమానులు తమకు నచ్చిన ప్రశ్నను సంధించమని కోరింది.
ఇంకెముంది దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఫ్యాన్స్ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ యూజర్ ప్రశ్నిస్తూ.. ‘నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పు.. అతని ఐడీ ఏంటో చెప్పు’ అని అడిగాడు. దానిని బదులిచ్చి అనన్య.. ‘బాయ్ ఫ్రెండ్.. అంత సీన్ లేదు భయ్యా.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అనుకుంటున్నారు.. అందుకే ఎవ్వరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. అదే సమస్య కావచ్చు’ అంటూ ఫన్నీగా బదులిచ్చిందీ చిన్నది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..