AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ అమ్మడే.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.?

సినిమాల్లో కొందరు హీరోయిన్లుగా కాకుండా సహాయ నటీమణులుగా మెరిసిపోతూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. తమ అందం, నటనతో ఆకట్టుకునే ఇలాంటి నటీమణులు ఒక్కోసారి కథానాయికల కంటే ఎక్కువగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నటి అదితి మ్యాకల్ కూడా ఒకరు. ఈమె పేరు చెప్పగానే చాలామంది సినీ ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ నటించిన సూపర్‌హిట్ మూవీ అర్జున్ రెడ్డి గుర్తుకొస్తుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ అమ్మడే.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.?
Aditi Myakal
Rajeev Rayala
|

Updated on: Nov 06, 2026 | 7:34 AM

Share

తెలుగు చిత్రసీమలో హీరోయిన్స్ మాత్రమే కాకుండా, బలమైన సహాయక పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసే నటీమణులు కొందరే ఉంటారు. కొన్నిసార్లు వీరు తమ అద్భుతమైన నటన, ఆకట్టుకునే గ్లామర్‌తో కొన్నిసార్లు మెయిన్ హీరోయిన్ కంటే ఎక్కువగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒక్కరు. ఆ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో తన క్యూట్ నటనతో ప్రేక్షకులను కవ్వించినా అదితి మ్యాకల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా వచ్చిన ట్రెండ్ సెట్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా విజయ్ దేవరకొండకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టడమే కాకుండా, అందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపునిచ్చింది. ఈ చిత్రంలో విజయ్ ఫ్రెండ్ పాత్రలో నటించి, తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది అదితి మ్యాకల్. అదితికి చిన్నతనం నుంచే కళలపై ఎంతో మక్కువ. చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంలో శిక్షణ పొంది పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి, పలు మోడలింగ్ షోలలో సందడి చేసింది. నటనపై ఉన్న మక్కువతో మొదట యూట్యూబ్ వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌ ద్వారా ప్రయాణం ప్రారంభించింది.

‘పాప పి సుశీల’, ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘పాష్ పోరీస్’ వంటి ప్రసిద్ధ వెబ్ సిరీస్‌లలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. వెబ్ సిరీస్‌ల నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన అదితి, ‘అర్జున్ రెడ్డి’తో పాటు ‘అమీ తుమీ’, ‘రాధ’, ‘మిఠాయ్’, ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’, ‘నేనులేని నా ప్రేమకథ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించినప్పటికీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. సినిమాల్లో ఎక్కువగా నటనతో ఆకట్టుకున్న ఈ వయ్యారి, సోషల్ మీడియాలో మాత్రం తన స్టైలిష్ అండ్ గ్లామరస్ పిక్స్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్ గా ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న అదితి మ్యాకల్ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

సింపుల్ లుక్ లోనే కనిపించినప్పటికీ ఈ అమ్మడి అందానికి అందరూ ఫిదా అయ్యారు. చీరకట్టులో ఎంతో అందంగా ఉన్న ఈ సుందరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ ఓపన్ చేస్తే చాలు ఈ అమ్మడే దర్శనమిస్తుంది. అంతలా కుర్రాళ్లు ఈ బ్యూటీకి ఫిదా అయ్యారు. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు , వీడియోలు చూసి.. “అర్జున్ రెడ్డిలో నటించిన అమ్మాయేనా ఈమె? ఇంత గ్లామరస్‌గా ఉందేంటి!” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తూ, ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us