బీర్ అంటే చాలా ఇష్టం.. బరాబర్ తాగుతా: నటి కామెంట్లు
బీర్ అంటే తనకు చాలా ఇష్టమని.. చాలా ఇష్టంగా తాగుతానని మాలీవుడ్ నటి వీనా నందకుమార్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఈమె నటించిన 'కెట్టోయ్‌లాన్ ఎంటె మాలఖా' అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
బీర్ అంటే తనకు చాలా ఇష్టమని.. చాలా ఇష్టంగా తాగుతానని మాలీవుడ్ నటి వీనా నందకుమార్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఈమె నటించిన ‘కెట్టోయ్‌లాన్ ఎంటె మాలఖా’ అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అందులో వీనా రిన్సీ అనే పాత్రలో నటించగా.. అందుకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీనా.. తన డ్రింకింగ్ అలవాటు గురించి మనసు విప్పి మాట్లాడింది.
‘‘బీర్‌పై నా ప్రేమను చెప్పేందుకు నేనే మాత్రం సందేహించను. నాకు ఉన్న డ్రింకింగ్ అలవాటు వలన ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. డ్రింకింగ్ అన్నది వ్యక్తిగతంగా నేను చేసుకున్న అలవాటు. నేను బీర్ తాగుతా అన్న విషయాన్ని బయటకు చెప్పడానికి నాకు ఎలాంటి భయం లేదు. అయినా దీని గురించి బయటకు చెప్పేందుకు నేనెందుకు భయపడాలి. ఇదేం క్రైమ్ కాదు కదా. బీర్ తాగడం గురించి నేను ఎంతైనా మాట్లాడతా. అయినా ఈ కాలంలో చాలామంది యువతకు బీర్ తాగడం అలవాటుగా మారింది’’ అని వీనా చెప్పుకొచ్చారు. కాగా వీనా చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు మద్దతిస్తుంటే.. మరికొందరేమో ఎంత అలవాటున్నా.. ఇలా చెప్పడం వలన ఇంకొందరు చెడిపోతారంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా తమకు ఉన్న చెడు అలవాట్ల గురించి సెలబ్రిటీలు బహిరంగంగా చెప్పడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ పలువురు తమకు ఉన్న అలవాట్ల గురించి చెప్పారు. ఇక ఇటీవల శృతీ హాసన్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు వైన్ చాలా బాగా తాగేద్దానన్ని కానీ.. ఆరోగ్యం దృష్ట్యా మానేశానని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
Read This Story Also: స్టార్ హీరో కుమార్తెను అని తెలిసి కూడా..: వరలక్ష్మీ శరత్ కుమార్