Venkatesh: ‘రానా నాయుడు 2’పై వెంకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఈసారి ఆ కంటెంట్..
దీంతో కొన్నివెబ్ సిరీస్‌లపై విమర్శలు సైతం వస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి విక్టరీ వెంకటేష్, రానా నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ఒకటి. అబ్బాయ్, బాబాయ్ నటించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా అన్ని భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. రా కంటెంట్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్ పరిమితికి మించి ఉన్నాయన్న అభిప్రాయం వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు పెట్టింది పేరైన వెంకటేష్ ఇలాంటి కంటెంట్‌తో...

ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు ఆదరణ లభిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీ బడ్జెట్‌తో ప్రాజెక్ట్స్‌ను చేపడుతుండడం, స్టార్ హీరోలు సైతం వీటిలో నటిస్తుండడంతో క్రేజ్ పెరుగుతోంది. ఇక ఓటీటీలో విడుదలవుతోన్న వెబ్ సిరీస్‌ల్లో ఉండే కంటెంట్ బోల్డ్ పరిమితి దాటుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సెన్సార్ లేకపోవడంత మేకర్స్ కూడా ఈ విషయంలో ఫ్రీ హ్యాండ్ తీసుకుంటున్నారు.
దీంతో కొన్నివెబ్ సిరీస్‌లపై విమర్శలు సైతం వస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి విక్టరీ వెంకటేష్, రానా నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఒకటి. అబ్బాయ్, బాబాయ్ నటించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా అన్ని భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. రా కంటెంట్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్ పరిమితికి మించి ఉన్నాయన్న అభిప్రాయం వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు పెట్టింది పేరైన వెంకటేష్ ఇలాంటి కంటెంట్‌తో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
దీంతో మేకర్స్ సైతం కొన్ని సీన్స్‌ను తొలగించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రానా నాయుడు 2ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్‌పై వెంకీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘సైంధవ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వెంకీ సిద్ధవముతున్నారు. జనవరి 13న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా టీజర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేష్ రానా నాయుడు 2 సిరీస్‌పై స్పందించారు. త్వరలోనే ఈ సిరీస్ రానుందని తెలిపారు. అయితే రానా నాయుడు వెబ్ సిరీస్‌పై తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శలపై ఏమంటారన్న ప్రశ్నకు వెంకీ బదులిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఆ సిరీస్ ఎంతోమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యిందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు తనను నాగా నాయుడు అనే పిలుస్తున్నారన్నారు. అది తనను ఆశ్చర్యానికి గురి చేసిందననారు. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌కు వెళ్లినప్పుడు కూడా అదే జరిగిందన్న వెంకీ.. ‘రానా నాయుడు’ హిందీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో ఆ కంటెంట్‌ను చాలా వరకూ తగ్గించామని, భవిష్యత్తులో ఇంకా తగ్గిస్తామని స్పష్టం చేశారు.
ఇక సైంధవ్ మూవీలో తన పాత్ర వైల్డ్, క్రేజీగా ఉంటుందని వెంకీ చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ, యూత్ ప్రతి ఒక్కరికి ఈ పాత్ర నచ్చుతుందన్న వెంకీ, ఈ పాత్రలో అన్నిరకాల భావోద్వేగాలుంటాయన్నారు. సైంధవ్‌లో ప్రేక్షకులు తప్పకుండా కొత్త వెంకీని చూస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




