Asalem Jarigindi Teaser: ‘అసలేం జరిగింది’ సినిమా టీజర్ రిలీజ్ చేసిన హీరో సునీల్.. మూవీ హీరో శ్రీరామ్ గురించి ఏం చెప్పాడంటే..
Asalem Jarigindi Teaser: 'అసలేం జరిగింది' సినిమా టీజర్ చూసి చాలా భయపడ్డానని చెబుతున్నాడు హీరో సునీల్. శ్రీరాం, సంచిత పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ
Asalem Jarigindi Teaser: ‘అసలేం జరిగింది’ సినిమా టీజర్ చూసి చాలా భయపడ్డానని చెబుతున్నాడు హీరో సునీల్. శ్రీరాం, సంచిత పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సునీల్ హైదరాబాద్‌లో లాంఛ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా వైవిధ్యమైన కాన్సెప్టుతో తీసిన ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. శ్రీరాంతో కలిసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించానని, తను మంచి నటుడని కితాబిచ్చారు.
సినిమా మంచి రికార్డ్స్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపాడు. మూవీ నిర్మాత మాట్లాడుతూ.. సినిమా మొత్తం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఉయ్యాల శంకర్ కంపోజ్ చేసిన ఫైట్స్, చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందన్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. అన్ని వర్గాలకు కావలసిన హంగులన్ని సినిమాలో ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు శ్రీకర్ రెడ్డి, సంగకుమారస్వామి, యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.