Krack Movie: రవితేజ-శృతిహాసన్‌ల ‘మాస్ బిర్యానీ” సాంగ్ రిలీజ్.. సింగరాల శివంగి అంటూ అదరగొట్టిన మాస్ మహారాజా..
మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న క్రాక్. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై బి.మధు నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న క్రాక్. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై బి.మధు నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతుంది. ఇక ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పంధన వచ్చింది. వరుస ప్లాపుల తర్వాత రవితేజ ఈ సినిమాతో హిట్ కోట్టాలని భారీగానే కష్టపడ్డట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని మాస్ బిర్యాని పాటను సోమవారం విడుదల చేసింది చిత్రయూనిట్. సింగరాల శివంగి.. వయ్యరాల ఫిరంగి అంటూ సాగుతుంది. ఈ పాటలో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు రవితేజ. మాస్ బిర్యాని పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. రాహుల్ నంబియార్, సాహితి చాగంటి గాత్రం అందించారు.
తాజాగా విడుదైల మాస్ బిర్యాని పాటకు కూడా మంచి స్పంధన వస్తోంది. ఈ సినిమాతో మళ్ళీ రవితేజ మళ్లీ రంగంలోకి వచ్చాడని అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదైలన భుమ్ బద్దల్, భలేగా తగిలావే బంగారం, కోరమీసం పోలీసోడా పాటలకు విశేష స్పంధన లభించింది. ఇందులో సాంగ్ షూటింగ్ కూడా చూపించారు. ఇక పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.
రవితేజ మాస్ బిర్యానీ సాంగ్ రిలీజ్..