Cinema : 2025లో 1000 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమా ఇదే.. ఇప్పటికీ థియేటర్లలో సంచలనమే..
కొత్త ఏడాది ప్రారంభానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు థియేటర్లలో ఓ సినిమా సంచలనం సృష్టిస్తుంది. అంతేకాదు.. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టిన ఏకైక సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది ధురంధర్ సినిమా. బాలీవుడ్ స్టా్ర్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇందులో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలకపాత్రలు పోషించగా.. ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన సారా అర్జున్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ చిత్రానికి ఆధిత్య ధార్ దర్శకత్వం వహించగా.. 1999 IC-814 హైజాకింగ్, 2001 పార్లమెంట్ దాడి, ముంబై దాడులు వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఓవైపు సినిమాలు పలు సన్నివేశాలపై విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ లెక్కలు మాత్రం తారుమారు చేస్తూ థియేటర్లలో సత్తా చాటుతుంది ఈ సినిమా. ఈ సినిమాకు రోజు రోజుకీ ఊహించని రెస్పాన్స్ వస్తుంది.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
ఇప్పుడు ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1060 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. భారతదేశంలో ధురంధర్ సినిమా రూ.700 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఇది కేవలం పెద్దలకు మాత్రమే అని.. కానీ ఇప్పటికే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ సినిమా మొత్తం 4,753 థియేటర్లలో ప్రదర్శింపబడుతుండగా.. ఇప్పటివరకు వెయ్యి కోట్లకు పైగా వసూల్లు వచ్చినట్లు మేకర్స్ తెలియజేశారు. దీంతో ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
ఇవి కూడా చదవండి : The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..
ఈ సంవత్సరం హిందీలో విడుదలైన స్త్రీ 2.. రూ.598 కోట్లు… ఛావా మూవీ రూ.601 కోట్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలను అధిగమించి ఈ ఏడాదిలోనే నెంబర్ వన్ మూవీగా ధురంధర్ నిలిచింది. అలాగే రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆధిత్య ధర్ కెరీర్ లోనే అత్యధిక వసూల్లు రాబట్టిన సినిమాగా ధురంధర్ నిలిచింది.
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.
