చోరికి గురైన ప్రియదర్శి బైక్.. దొంగ దొరికేశాడు

ప్రముఖ కమెడియన్, నటుడు ప్రియదర్శి బైక్ దొంగతనానికి గురైంది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘‘నా బైక్ దొంగతనానికి గురైంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇది. దాన్ని దొంగలించే వ్యక్తికి అక్కడ సీసీటీవీ కెమెరా ఉన్నది కూడా తెలీదు. వాట్ యాన్ అన్‌ప్రొఫెషనల్ థీప్’’ అంటూ కామెంట్ పెట్టాడు. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసుకున్నాడు. అయితే ఆ దొంగ హీరో సందీప్ కిషన్ కావడం విశేషం. అదేంటి.. ప్రియదర్శి బైక్‌ను సందీప్ […]

చోరికి గురైన ప్రియదర్శి బైక్.. దొంగ దొరికేశాడు
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Jul 09, 2019 | 12:57 PM

ప్రముఖ కమెడియన్, నటుడు ప్రియదర్శి బైక్ దొంగతనానికి గురైంది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘‘నా బైక్ దొంగతనానికి గురైంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇది. దాన్ని దొంగలించే వ్యక్తికి అక్కడ సీసీటీవీ కెమెరా ఉన్నది కూడా తెలీదు. వాట్ యాన్ అన్‌ప్రొఫెషనల్ థీప్’’ అంటూ కామెంట్ పెట్టాడు. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసుకున్నాడు. అయితే ఆ దొంగ హీరో సందీప్ కిషన్ కావడం విశేషం. అదేంటి.. ప్రియదర్శి బైక్‌ను సందీప్ కిషన్ కొట్టేయడమేంటి అనుకుంటున్నారా..!

https://twitter.com/priyadarshi_i/status/1148216050439163906

అసలు విషయం ఏంటంటే సందీప్ కిషన్ హీరోగా ‘నిన్ను వీడని నీడని నేను’ అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించింది చిత్ర యూనిట్. అందులో భాగంగా సందీప్ కిషన్‌.. ప్రియదర్శి బైక్‌ను దొంగలించినట్లు ఓ వీడియోను తీశారు. దీనిపై సందీప్ కిషన్‌ కూడా క్లారిటీ ఇచ్చాడు.

‘‘మేము ఊహించిన దాని కంటే ఇది ఎక్కువ సీరియస్ అయ్యింది. నిన్ను వీడని నీడను నేను కోసం ఇది మేము చేసిన ఒక ఫన్నీ ప్రమోషనల్ క్యాంపైన్. ప్రియదర్శి డేట్స్ మాకు దొరకకపోవడంతో.. సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్‌గా అతడి బైక్‌ను వాడుకున్నాం’’ అని కామెంట్ పెట్టాడు. దీనిపై ప్రియదర్శి ‘‘థ్యాంక్స్ అన్న నా బండికి కూడా బ్రేక్ ఇచ్చావు’’ అంటూ స్పందించాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu