ఇప్పుడు ‘ఎ’ సర్టిఫికేట్ చూపిస్తా

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మథుడు 2’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ టీజర్ రిలీజైంది. ఇందులో రకుల్ అవంతిక అనే పాత్రలో నటించగా.. అటు సంప్రదాయం, ఇటు మోడ్రన్ గర్ల్ రెండు షేడ్‌లతో కలిసి కనిపించింది. టీజర్ చూస్తుంటే సినిమాలో ఆమె పాత్ర ఆసక్తికరంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో శ్రీలక్ష్మీ, వెన్నెల కిశోర్, రావు రమేష్, […]

ఇప్పుడు ‘ఎ’ సర్టిఫికేట్ చూపిస్తా
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 09, 2019 | 9:30 AM

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మథుడు 2’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ టీజర్ రిలీజైంది. ఇందులో రకుల్ అవంతిక అనే పాత్రలో నటించగా.. అటు సంప్రదాయం, ఇటు మోడ్రన్ గర్ల్ రెండు షేడ్‌లతో కలిసి కనిపించింది. టీజర్ చూస్తుంటే సినిమాలో ఆమె పాత్ర ఆసక్తికరంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో శ్రీలక్ష్మీ, వెన్నెల కిశోర్, రావు రమేష్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలో నటించగా.. చేతన్ బరద్వాజ్ సంగీతం అందించాడు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, వియాకామ్ 18స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మన్మథుడుతో కెరీర్‌లో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న నాగార్జున.. మరి అదే పేరుతో వస్తోన్న సీక్వెల్‌లో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu