Prakash Raj: ఎన్టీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. అసెంబ్లీ వ్యవహారంపై ఏమన్నారంటే..
Prakash Raj: శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనపై ఒక్కక్కరు స్పందిస్తున్నారు. చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంపై పలువురు రాజకీయ నాయకులతో నందమూరి, నారావారి కుటుంబసభ్యులు...

Prakash Raj: శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనపై ఒక్కక్కరు స్పందిస్తున్నారు. చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంపై పలువురు రాజకీయ నాయకులతో నందమూరి, నారావారి కుటుంబసభ్యులు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ తన కుటంబసభ్యులతో కలిసి వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి కానీ.. దూషణలు సరికాదని జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఘటన దారుణం అని పేర్కొన్నారు. ఈ విషయమై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఎన్టీఆర్ వీడియోపై పలువురు స్పందిస్తున్నారు. యంగ్ టైగర్‌కు మద్ధుతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఎన్టీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ వీడియోను రీట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్.. ‘చాలా బాగా చెప్పావు’ (వెల్ సెడ్ డియర్) అంటూ క్యాప్షన్ జోడించారు. ఇలా చంద్రబాబు కుటుంబానికి తన మద్ధతును చెప్పకనే చెప్పాడు ప్రకాశ్ రాజ్. ఇదిలా ఉంటే మా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన తర్వాత ప్రకాశ్ రాజ్ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. తాజాగా ఎన్టీఆర్‌కు మద్ధతుగా ట్వీట్ చేయడంతో మరోసారి ప్రకాశ్ రాజ్ వార్తల్లో నిలిచారు.
Well said dear @tarak9999 … ?????? .. https://t.co/QLsSBuzqQ0
— Prakash Raj (@prakashraaj) November 20, 2021
Also Read: Viral Video: నోట్లోంచి సాలె పురుగు !! ఒళ్లు గగుర్పొడిచే వీడియో !! వీడియో
Aditi Rao Hydari: మిల్కీ వైట్ టోన్డ్ స్కిన్ బ్యూటీ అదితి పోస్ట్ పై అభిమాని కొంటె కామెంట్..
సింగిల్స్ డే అమ్మకాల్లో రూ.10 లక్షల కోట్ల వ్యాపారం !! వీడియో