AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani – Karthi: నాని సినిమాలో కార్తీ స్పెషల్ రోల్.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఇప్పటివరకు చూడని పాత్రలో నాని కనిపించనుండడంతో మూవీపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

Nani - Karthi: నాని సినిమాలో కార్తీ స్పెషల్ రోల్.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Karthi, Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 03, 2025 | 8:27 AM

న్యాచురల్ స్టార్ నాని సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాయ్ నాన్న హిట్ తర్వాత ఈ హీరో నటిస్తున్న లేటేస్ట్ మూవీ హిట్ 3. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు నాని. టీజర్, పోస్టర్లతోనే మూవీపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఈసారి ఈ చిత్రంలో నాని మరింత కొత్తగా చూపించనున్నారు. డైరెక్టర్ శైలెష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. కొన్ి నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా నాని కొత్త సినిమాల గురించి ఆసక్తిరక అప్డేట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. నాని నటిస్తున్న హిట్ 3 చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ స్పెషల్ రోల్ చేయనున్నాడట. ఈ సినిమాలో కార్తీ పాత్ర చాలా ముఖ్యమైనదని.. వీరిద్దరి కాంబోలో సీన్స్ ఉంటాయని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే హిట్ 3లో కీలకపాత్రలో కార్తీ కనిపిస్తాడని.. ఆ తర్వాత ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చే హిట్ 4లో ప్రధాన పాత్ర పోషిస్తాడని అంటున్నారు. నాని హిట్ చిత్రం హిట్ 3 మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సహా వివిధ భాషలలో విడుదలవుతోంది.

ఇక కార్తీ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరిసారిగా మెయియఝగన్ (సత్యం సుందరం) చిత్రంలో కనిపించాడు. ఇందులో అరవింద్ స్వామి, శ్రీ దివ్య కీలకపాత్రలు పోషించారు. విడుదలైన తర్వాత ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించకపోయినా, సమీక్షల పరంగా మొత్తం ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన సర్దార్ 2 చిత్రంలో కూడా ఆయన నటించారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..

ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి