స్పీడ్ పెంచేసిన సంయుక్త మీనన్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ.?

28 April 2025

Rajeev 

ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ 2016లో మలయాళ చిత్రం పాప్‌కార్న్ తో హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసింది. 

తెలుగులో ‘భీమ్లా నాయక్’ చిత్రంతో బాగా పాపులర్ అయింది సంయుక్త. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి భార్య పాత్రలో కనిపించింది.

ఆ తర్వాత ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఆతర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థతో ‘స్వయంభు’ అనే పాన్-ఇండియా చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఆమె లుక్ ను రిలీజ్ చేశారు. 

అలాగే ‘బింబిసార 2’ కూడా నటించే అవకాశం ఉంది. వీటితో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హైంధ‌వ‌, బాల‌య్య‌తో చేస్తున్న అఖండ‌2 ఉన్నాయి.

అంతే కాదు శ‌ర్వానంద్ తో నారీ నారీ న‌డుమ మురారీలోనూ నటిస్తుంది. వీటితో పాటు బాలీవుడ్ లోనూ ఛాన్స్ అందుకుందని టాక్